అర్జున్ రెడ్డి డైరక్టర్ తో మహేష్ మూవీ క్యాన్సిలా..?

Google+ Pinterest LinkedIn Tumblr +

తన మొదటి సినిమా అర్జున్ రెడ్డితో దర్శకుడిగా తన సత్తా చాటిన సందీప్ వంగా ఓ విధంగా తెలుగు సినిమాకు కొత్త ట్రెండ్ సృష్టించాడని చెప్పొచ్చు. ఆ సినిమాతో విజయ్ దేవరకొండ స్టార్ గా ఎదిగాడు. ఇక అదే సినిమాను హిందిలో షాహిద్ కపూర్ తో కబీర్ సింగ్ అని తీస్తున్నాడు సందీప్ వంగ. ఆ సినిమాలో కియరా అద్వాని హీరోయిన్ గా నటిస్తుందని తెలుస్తుంది. బాలీవుడ్ కల్చర్ కు తగినట్టుగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడట సందీప్ వంగ.

ఇక కబీర్ సింగ్ ఓ పక్క సెట్స్ మీద ఉండగానే సూపర్ స్టార్ మహేష్ తో ఓ లైన్ డిస్కస్ చేశాడు సందీప్ వంగ. షుగర్ ఫ్యాక్టరీ టైటిల్ కూడా అనుకున్నారు. అయితే ఈ సినిమా కథ బాగా నచ్చినా ఆడియెన్స్ తనని ఇలా రిసీవ్ చేసుకుంటారో లేదో అన్న డౌట్ తో కొద్దిరోజులు ఆలోచనలో ఉన్నాడు మహేష్. ఫైనల్ గా ప్రస్తుతం ఉన్న టైంలో ప్రయోగాలు ఎందుకని సందీప్ వంగకు సినిమా చేయనని చెప్పాడట. అయితే వేరే కథతో వస్తే చేస్తానని మాత్రం హామీ ఇచ్చాడట.

అర్జున్ రెడ్డి డైరక్టర్ తో మహేష్ మూవీ ఉంటుందని ఆశించిన సూపర్ స్టార్ ఫ్యాన్స్ కు ఇది ఓ రకంగా చేదు వార్తే.. కాని మహేష్ మహర్షి తర్వాత సుకుమార్ సినిమా చేసే ముందే అనీల్ రావిపుడి డైరక్షన్ లో ఓ సినిమా చేస్తాడని అంటున్నారు. ఏది ఏమైనా మహేష్ పర్ఫెక్ట్ ప్లానింగ్ లో ఉన్నాడని మాత్రం చెప్పొచ్చు.

Share.