సూపర్ స్టార్ మహేష్ ప్రస్తుతం తన 25వ సినిమా మహర్షి షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. వంశీ పైడిపల్లి డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమాలో మహేష్ కు జోడీగా పూజా హెగ్దె నటిస్తుంది. ఇక ఈ సినిమా తర్వాత మహేష్ సుకుమార్ డైరక్షన్ లో సినిమా చేయాల్సి ఉంది. సుకుమార్ చెప్పిన లైన్ ఓకే చేసిన మహేష్ ఫుల్ స్క్రిప్ట్ కోసం వెయిట్ చేస్తున్నాడట. ఈలోగా మహేష్ ను సక్సెస్ ఫుల్ డైరక్టర్ అనీల్ రావిపుడి కలిసి ఓ కథ వినిపించాడట. మహేష్ కు కథ బాగా నచ్చడంతో అనీల్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట.
దిల్ రాజు, అనీల్ సుంకర ఇద్దరు కలిసి ఈ సినిమా నిర్మిస్తారని తెలుస్తుంది. పటాస్ నుండి ఎఫ్-2 వరకు వరుస సక్సెస్ లను అందుకుంటున్న డైరక్టర్ అనీల్ రావిపుడి మహేష్ సినిమాను మస్త్ జబర్దస్త్ ఎంటర్టైనర్ కథ రాసుకున్నాడట. ఈ సినిమాకు టైటిల్ గా వాట్సప్ అని పెడుతున్నారట. ఆల్రెడీ ఈ టైటిల్ దిల్ రాజు రిజిస్టర్ చేయించారట. మొత్తానికి మహేష్ తో అనీల్ రావిపుడి వాట్సప్ సినిమా చేస్తాడని ఫిక్స్ అవ్వొచ్చు.
సుకుమార్ సినిమా తర్వాత ఈ సినిమా ఉంటుందా లేక సుకుమార్ కు ముందే అనీల్ తో చేస్తాడా అన్నది తెలియాల్సి ఉంది. ఇదిలాఉంటే అర్జున్ రెడ్డి డైరక్టర్ సందీప్ వంగ సినిమాకు మహేష్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. మరి ఆ సినిమా ఎప్పుడు సెట్స్ మీదకు వెళ్తుందో చూడాలి.