టాలీవుడ్ సినిమాలంటే ఒకప్పుడు బాలీవుడ్కు చిన్నచూపు… ఇప్పుడు రోజులు మారాయి… ప్రముఖ దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బాహుబలి టాలీవుడ్ తలరాతే మార్చేసింది…. బాహుబలి సాధించిన విజయంతో బాలీవుడ్ ఉలిక్కిపడటం పాటుగా హిందిలోను బాహుబలి కాసుల రాశులను కురిపించింది… బాహుబలి తర్వాత బాలీవుడ్ నిర్మాతలు తెలుగు లో విడుదల అవుతున్న సినిమాలను బాలీవుడ్లో రీమేక్ చేసేందుకు ఉవ్విళ్ళూరుతున్నారు. బాలివుడ్ నిర్మాతలు టాలీవుడ్ పై కన్నేసి ఇక్కడి నిర్మాతలో కలిసి బాలీవుడ్లో సినిమాలు రీమేక్ చేస్తున్నారు. అదే కోవలోకి మహర్షి సినిమాపై బాలీవుడ్ నిర్మాతలు కన్నేశారు.
ప్రిన్స్ మహేష్బాబు నటించిన మహర్షి విడుదలై కనివిని ఎరుగని రీతిలో ప్రపంచ వ్యాప్తంగా ప్రదర్శంచబడుతుంది. భారీ వసూలు చేసేందుకు దూసుకుపోతున్న ఈ సినిమాను బాలీవుడ్ అగ్రహీరోలతో రీమేక్ చేసేందుకు ఉబలాటపడుతున్నారని బాలీవుడ్ వర్గాల కథనం. మహర్షి సినిమాను దిల్రాజు మరో ఇద్దరు నిర్మాతలతో కలిసి నిర్మించారు. ఇప్పుడు దిల్రాజ్తో కలిసి బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్ ఈ సినిమాను రీమేక్ చేసే ఆలోచనతో ఉన్నట్లు సిని పరిశ్రమలో వినిపిస్తుంది.
ప్రభుదేవాతో కలిసి ఈ సినిమాను ముంబాయిలో చూసేందుకు సల్మాన్ఖాన్ ఏర్పాట్లు చేసుకుంటున్నారని వినికిడి. ఈ సినిమాను సల్మాన్ఖాన్ హీరోగా ప్రభుదేవా దర్శకత్వంలో రీమేక్ చేయాలని ప్రయత్నాలు జరుగుతున్నట్లు వార్తలు చెక్కర్లు కొడుతున్నాయి. సల్మాన్ఖాన్ హీరోగా ప్రభుదేవా దబంగ్3 సినిమాను రూపొందిస్తున్నారు. కొసమెరుపు ఏంటంటే ప్రముఖ బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ ఈ సినిమా విడుదలపై మహేష్ బాబుకు ట్విట్టర్లో శుభాకాంక్షలు తెలిపారు. కరణ్ జోహార్ ఈ సినిమాను సల్మాన్ ఖాన్ హీరోగా రీమేక్ చేయాలని ఆలోచిస్తున్నట్లు సిని పండితులు అంటున్నారు. ఏదేమైనా బాలీవుడ్ అగ్రహీరోలు, దర్శకులు, నిర్మాతలు టాలీవుడ్ బాట పట్టడం తెలుగు చిత్రపరిశ్రమకు మంచిరోజులు వస్తున్నట్లే.