ఆ సినిమా నుండి లావణ్యని తొలగించారా..!

Google+ Pinterest LinkedIn Tumblr +
ప్రస్తుతం ఉన్న హీరోయిన్స్ లో తన సత్తా చాటుతున్న లావణ్య త్రిపాఠి అందాల రాకషి సినిమా నుండి ప్రేక్షక హృదయలాను గెలిచిన రాక్షసిగా క్రేజ్ తెచ్చుకుంది. మధ్యలో నాగార్జున లాంటి సీనియర్ హీరోతో నటించి కెరియర్ లో వెనుక పడినట్టు కనిపించినా మళ్లీ యువ హీరోల సరసన ఛాన్స్ అందుకుని ట్రాక్ ఎక్కేసింది.
లేటెస్ట్ గా ఓ బ్లాక్ బస్టర్ మూవీ సినిమాలో ఛాన్స్ వదులుకుందట లావణ్య త్రిపాఠి. ఇటీవల రిలీజ్ అయ్యి సూపర్ హిట్ సినిమాగా నిలిచిన గీగా గోవిందం సినిమాలో రష్మికకు బదులు ముందు లావణ్య త్రిపాఠినే హీరోయిన్ గా అనుకున్నారట. కొన్ని సీన్స్ షూట్ చేశారట కూడా అయితే ఇదవరకు తన సినిమాల్లో ఇలాంటి పాత్రలే చేసి ఉండటం వల్ల లావణ్య హీరోయిన్ క్యారక్టరైజేషన్ మార్చమని దర్శకుడు పరశురాం ను అడిగిందట. అయితే దానికి ఏమాత్రం ఒప్పుకోని పరశురాం హీరోయిన్ ను మార్చేశాడట.
ఫైనల్ గా ఓ బ్లాక్ బస్టర్ మూవీ ఛాన్స్ మిస్సైంది లావణ్య. ఒకవేళ లావణ్య త్రిపాఠి గీతా గోవిందం చేసినా అంత కిక్ ఇచ్చేది కాదు. ఛలో తర్వాత రష్మిక సూపర్ హిట్ అందుకుంది. లావణ్య తప్పుకోవడం రష్మికకు లక్కీ అని చెప్పొచ్చు.
Share.