టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ – రామ్ చరణ్ హీరోలుగా దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో వస్తోన్న ఆర్ ఆర్ ఆర్ మల్టీస్టారర్ మూవీ షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. తెలుగు సినిమా ఖ్యాతిని బాహుబలి సినిమాతో భారతదేశ ఎల్లలు దాటించి ప్రపంచవ్యాప్తంగా చాటిన రాజమౌళి నుంచి వస్తోన్న సినిమా కావడం… బాహుబలి తర్వాత ఈ క్రేజీ ప్రాజెక్టును రాజమౌళి టేకాఫ్ చేయడంతో ఈ సినిమాపై మామూలు అంచనాలు లేవు.
టాలీవుడ్‌లో స్టార్ హీరోలుగా ఉన్న ఎన్టీఆర్, రామ్‌చరణ్ కాంబినేషన్‌లో సినిమా వస్తుందని ఎవ్వరూ ఊహించలేదు. వీరి కాంబోలో మల్టీస్టారర్ సెట్ చేసిన ఘనత రాజమౌళీకే దక్కింది. కొమరం భీం పాత్రలో ఎన్టీఆర్, అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్‌చరణ్ నటిస్తోన్న ఈ సినిమాలో ప్రస్తుతం చిత్ర యూనిట్ ఎన్టీఆర్‌పై కొన్ని కీలకమైన యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించినట్టు తెలుస్తోంది.
ఈ యాక్షన్ సన్నివేశాలు మైండ్ బ్లోయింగ్ అనేలా ఉన్నాయని తెలుస్తోంది. ఎన్టీఆర్ కు, బ్రిటిష్ సైనికులకు మధ్య వచ్చే ఈ యాక్షన్ సన్నివేశాలు సినిమాకే హైలెట్‌గా నిలుస్తాయట. బ్రిటిష్ సైనికులు భారతీయుల పై చేసే దాడులకి ప్రతీకారంగా ఎన్టీఆర్ వారితో విరోచితంగా యుద్ధం చేసి వారిని అంతం చేసే క్రమంలోనే ఈ సీన్లు వస్తాయట.
ఇక ఈ సినిమాలో బాలీవుడ్ సీనియర్ హీరో అజయ్ దేవగన్, సముద్రఖని నటిస్తున్నారు. అజయ్ దేవగణ్ ‘ఆర్ఆర్ఆర్’లో ఓ ఫ్రీడమ్ ఫైటర్ పాత్రలో నటిస్తున్నారు. డీవీవీ ఎంటెర్టైన్మెంట్స్ పతాకం ఫై దానయ్య నిర్మిస్తున్నారు. జులై 30, 2020 లో విడుదల కాబోతున్న ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తున్నారు.