తెలుగులో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన పంజాబీ భామ తాప్సీ పన్ను టాలీవుడ్‌లో పలు సినిమాలు చేసి మంచి పేరు సంపాదించుకుంది. అయితే ఆ తరువాత నెమ్మదిగా బాలీవుడ్ వైపు అడుగులు వేసి ఇప్పుడు పూర్తిగా అక్కడే సెటిల్ అయిపోయింది ఈ బ్యూటీ.
వరుస విజయాలతో బాలీవుడ్‌లో తన సత్తా చూపిస్తోన్న తాప్సీ తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఒక ఆసక్తికరమైన విషయాన్ని చెప్పుకొచ్చింది. తన కోరిక ఇంకా తీరలేదని తాప్సీ అనడంతో ఫ్యాన్స్ చాలా క్యూరియాసిటీగా అదేమిటా అని చూశారు. తనకు స్టార్ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో ఎప్పటికైనా ఒక సినిమా చేయాలనేది కోరిక అని ఆమె చెప్పుకొచ్చింది. హీరోయిన్లను ఎలా చూపించాలో మణిరత్నంకు బాగా తెలుసు అంటూ ఆమె మణిరత్నం భజన చేస్తోంది.
ఇప్పటికే చాలా మంది డైరెక్టర్స్‌తో చేసిన ఈ బ్యూటీ ఇప్పుడు ఉన్నఫలంగా మణిరత్నం భజన ఎందుకు చేస్తుందా అని క్రిటిక్స్ ప్రశ్నిస్తున్నారు. ఏదేమైనా తనకు ఉన్న ఆ ఒక్క కోరిక మాత్రం ఇంకా తీరలేదని వాపోతుంది ఈ పాప.