నాని ‘మజ్ను’ సినిమాలో హీరోయిన్గా పరిచయం అయిన అను ఇమ్మాన్యుయెల్ ఆ తరువాత రాజ్ తరుణ్ రాజుగాడు సినిమాతో వరుస సక్సెస్‌లను అందుకుంది. ఆ తరువాత కొన్ని పెద్ద సినిమాలను వరుసబెట్టి సైన్ చేసింది ఈ బ్యూటీ. కానీ పాపం అమ్మడికి అదృష్టం కలిసిరాలేదు. దీంతో చేసిన ప్రతీ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టేసింది.
గోపీచంద్ హీరోగా తెరకెక్కిన ‘ఆక్సీజన్’, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘అజ్ఞాతవాసి’, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ ఇలా వరుస సినిమాలు బాక్సాఫీస్ వద్ద బక్కెట్ తన్నేయడంతో అను ఫ్లాప్‌లను మూటగట్టుకుంది. ఇప్పుడు ఈమె చేతిలో ఒకే ఒక్క సినిమా ఉంది. అక్కినేని నాగచైతన్య హీరోగా నటిస్తున్న ‘శైలజా రెడ్డి అల్లుడు’ సినిమాలో అను హీరోయిన్గా నటిస్తోంది. ఈ సినిమాపైనే నమ్మకాలు పెట్టుకుంది ఈ బ్యూటీ.
ఎలాగైనా ఈ సినిమా హిట్ కావాలని కోరుకుంటోంది అను. అయితే ఈ చిత్ర దర్శకుడు మారుతి తన సినిమాల్లో హీరోయిన్లకు మంచి ఇంపార్టెన్స్ ఉన్న పాత్రలు ఇస్తుంటాడు. ఇదే నమ్మకంతో ఈ సినిమా చేసేందుకు ఒప్పుకుంది అను. మరి అను ఇమ్మాన్యుయెల్ అనుకున్నట్లు ఈ సినిమా సక్సెస్ అవుతుందో లేదో చూడాలి. ఒకవేళ ఈ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద బొక్కబోర్లా పడితే అను కెరీర్‌కు ఇక ఫుల్స్టాప్ పడినట్లే అవుతుంది.