అందాల నటి కియారా అద్వానీ తాజాగా ఒక క్రేజీ ఆఫర్ ని కొట్టేసింది, అదే బాలీవుడ్ బడా నిర్మాత కరణ్ జోహార్ తదుపరి చిత్రంలో. మన బాహుబలి సినిమాని హిందీ లో రిలీజ్ చేసి అక్కడ కూడా భారీ హిట్ సాధించటంలో కరణ్ జోహార్ ముఖ్య భూమిక పోషించారు. తన సొంత నిర్మాణ సంస్థ ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్ లో అనేక మంది నూతన నటీనటులకు ఎన్నో అవకాశాలు ఇచ్చారు కరణ్.
ఎం ఎస్ ధోని చిత్రంతో బాలీవుడ్ లోకి ప్రవేశించి మంచి హిట్ అందుకుంది కియారా, అటు తర్వాత తెలుగు లో మహేష్ బాబు సరసన భారత్ అనే నేను చిత్రంలో నటించి ప్రేక్షకులని తన అందం, అభినయం తో బాగా ఆకట్టుకుంది. ఇక ఇప్పుడు తాజాగా కరణ్ జోహార్ చిత్రంలో ఒక మంచి ఆఫర్ ఈ అమ్మడి ఖాతాలో వచ్చి చేరింది. ఇండస్ట్రీ లోకి వచ్చిన అతి కొద్దీ కాలంలోనే ఇలా స్టార్ హీరోల సరసన ఆఫర్స్ రావటం కియారా అదృష్టమని చెప్పాలి.ప్రస్తుతం కియారా తెలుగులో రామ్ చరణ్ సరసన నటిస్తుంది. ఈ చిత్రానికి బోయపాటి శ్రీను దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు.
క్రేజీ ఆఫర్ కొట్టేసిన కియారా అద్వానీ
Share.