టాలీవుడ్ క్రేజీ హీరోతో కీర్తి సురేష్

Google+ Pinterest LinkedIn Tumblr +

భీష్మ సినిమా ఇంకా ప‌ట్టాలెక్క‌ముందే నితిన్ మ‌రో సినిమా చేసేందుకు సిద్ధ‌మ‌య్యాడ‌ట‌. ఇటీవ‌ల కాలంలో నితిన్ చేసిన సినిమాలు అనుకున్న మేర విజ‌య‌వంతం కాలేక‌పోతున్నాయి. దీంతో వ‌రుస‌గా ఎదురు దెబ్బ‌లు తింటున్న నితిన్‌కు శ్రీ‌నివాస క‌ళ్యాణం సినిమా కొంత మేర‌కు ఊర‌ట‌నిచ్చింద‌నే చెప్పాలి. అయినా బ్లాక్ బ‌స్ట‌ర్ లాంటి సినిమాలు లేవ‌నే వెలితి నితిన్‌ను వెంటాడుతూనే ఉంది. త‌న కేరీర్ కు ప్ర‌మాద ఘంటిక‌లు రాకముందే మేల్కోనే ప‌నిలో ప‌డ్డాడు.

నితిన్ త‌న కేరీర్‌ను చ‌క్క‌దిద్దుకునే క్ర‌మంలో ఉన్నస‌మయంలోనే భీష్మ సినిమాకు సైన్ చేశాడు. ఈ సినిమాను వెంకి కుడుముల ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. నితిన్ కోసం భీష్మ స్క్రీప్ట్ త‌యారు చేసి ప‌ట్టాలెక్కించేందుకు సిద్ధం చేశాడు. హీరోయిన్ ర‌ష్మీక మంద‌న్న హీరోయిన్‌గా ఎంపిక చేశారు. ఈ సినిమా త్వ‌ర‌లో ప‌ట్టాలేక్క‌నున్నది. ఈసినిమా ఇంకా సెట్స్ మీద‌కు వెళ్ళ‌క‌ముందే మ‌రో ప్రాజెక్టు చేసేందుకు సిద్ధ‌మ‌వుతున్నాడ‌ట నితిన్‌.

నితిన్ భీష్మ పూర్తి కాగానే వెంట‌నే సినిమా చేసేందుకు వెంకీ అట్లూరి సిద్ద‌మ‌వుతున్నాడ‌ట‌. నితిన్ కు జోడిగా మహాన‌టి ఫేం కీర్తి సురేష్‌ను ఎంపిక చేసిన‌ట్లు ఫిలిం న‌గ‌ర్‌లో వార్త చ‌క్క‌ర్లు కొడుతోంది. మ‌హాన‌టి సినిమా త‌రువాత కీర్తి సురేష్ తెలుగులో మ‌రో సినిమా చేయ‌లేదు. కోలివుడ్‌లోనే సినిమాలు చేస్తూంది. కోలివుడ్ సినిమాలు తెలుగులో వ‌స్తున్న‌ప్ప‌టికి నేరుగా హీరోయిన్‌గా న‌టించ‌లేదు. ఇప్ప‌డు నితిన్ సినిమాలో ఎంపికైంది భీష్మ పూర్తి కాగానే ప్రాజెక్టు ప్రారంభించ‌నున్నార‌ట వెంకి అట్లూరి.

Share.