అతి తక్కువ కాలంలోనే అతి ఎక్కువ కీర్తి గడించి అందరి మెప్పు పొందిన నేటి మేటి సావిత్రి కీర్తీ సురేష్ నటన గురించి ఎంత చెప్పుకున్నా.. తక్కువే. ఆమె పండించే హావ భావాలకు ఎవరైనా మంత్ర ముగ్దులు కావాల్సిందే. ఇక ఈ మధ్య కాలంలో ఆమె నటించి అందరిని మెప్పించిన ”మహా నటి” సినిమా చూస్తే కీర్తి నటన ఇంత న్యాచురల్ గా ఉంటుందా అనే సందేహం అందరిలోనూ వ్యక్తం అవుతుంది.
సావిత్రి పాత్రను అచ్చం ఆమెలా పోషించి జూనియర్ సావిత్రిగా పేరుపొందింది. నిజంగా ఆమె నటనకు హ్యాట్సాప్ చెప్పాల్సిందే. ఆ సినిమాతో అంత చక్కటి పేరు తెచ్చుకున్న కీర్తి సురేష్.ఆ తర్వాత ఒక్క డైరెక్ట్ తెలుగు సినిమాలో కనిపించలేదు. కాకపోతే… అంత భారీ హిట్ ను సొంతం చేసుకున్న ఆ భామకు ఆ తర్వాత వరుసగా అటు తమిళంలో నాలుగు సినిమా ఛాన్స్ లు వచ్చాయి.
కానీ ఇప్పటివరకూ ఒక్క తెలుగు సినిమాకు కూడా ఆమె సైన్ చెయ్యలేదు అంటే.ఆమెకు కథలు నచ్చడంలేదా? లేక తెలుగు సినిమాల్లో నటించడం ఆమెకు ఇష్టం లేదా అనే సందేహాలు అందరిలోనూ కలుగుతున్నాయి. దీంతో ఆమె తెలుగు సినిమాలను చిన్న చూపు చూస్తోంది అంటూ… అనేక విమర్శలు కూడా ఆమె మీద వినిపిస్తున్నాయి.