భారతీయ దర్శక దిగ్గజాల్లో మణిరత్నం ఒకరు. మణిరత్నం చిత్రాలకు ఉన్న క్రేజ్ ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ‘నాయకుడు’, ‘రోజా’, ‘బొంబాయి’, ‘గీతాంజలి’ వంటి చిత్రాలను తెరకెక్కించాడు. తన మేకింగ్‌తో కోట్లాది మంది అభిమానుల్ని ప్రపంచవ్యాప్తంగా సంపాదించుకున్నారు. అలాంటి అణిముత్యం లాంటి మణిరత్నం సినిమాలో కీర్తి సురేష్ నటిస్తున్నదంటే నమ్మబుద్ది కావడం లేదు కదూ… నిజమేనండి సుమా…
మణిరత్నం గారు గతంలో డైరెక్ట్ చేసిన సఖీ సినిమాలో కీర్తి సురేష్ నటిస్తున్నారు. కాకుంటే ఈ సినిమాను మణిరత్నం కాకుండా మరో కొత్త దర్శకుడు రూపొందించనున్నాడు. మణిరత్నం గత 18 ఏండ్ల క్రితం మాధవన్ హీరోగా, షాలిని హీరోయిన్గా సఖీ సినిమాను తెరకెక్కించాడు. ఈ సినిమా ఆరోజుల్లో విజయవంతంగా ప్రదర్శించబడింది. ఇప్పుడు కీర్తి సురేష్ హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాగా రూపొందబోతోంది.
సఖీ సినిమాకు నూతన దర్శకుడు నాగేంద్ర దర్శకత్వం వహిస్తున్నాడు. నాగేంద్ర ఓ కొత్త కథతో కీర్తి సురేష్‌ను సంప్రదించగా, ఈ సినిమాకు సఖీ అనే పేరును ఖరారు చేశారట. కీర్తి సురేష్ మహానటి సినిమాలో నటించిన తరువాత ఆమే తెలుగులో మరే సినిమాలో నటించలేదు. మహానటి తరువాత కీర్తి సురేష్ పాపులారిటీ అమాంతం పెరిగిపోయింది. సఖీ సినిమా కూడా లేడి ఓరియంటెడ్ కావడంతో ఈ సినిమాను ఆమేతోనే తీస్తున్నారట.