మాల్దీవ్స్ లో ఎంజాయ్ చేస్తున్న విక్కీకౌశల్-కత్రినాకైఫ్?

Google+ Pinterest LinkedIn Tumblr +

బాలీవుడ్ ప్రేమ జంట విక్కీ కౌశల్, కత్రినాకైఫ్ ఇటీవలే డిసెంబర్ 9న మూడుముళ్ల బంధంతో ఒక్కటైన విషయం తెలిసిందే. పెళ్లి తర్వాత హనీమూన్ కోసం తాజాగా మాల్దీవ్స్ వాలిపోయారు. ఈ జంట పెళ్లికి సంబంధించిన వార్తలు కేవలం బాలీవుడ్ లో మాత్రమే కాకుండా దేశవ్యాప్తంగా హైలైట్ అయ్యాయి. ఈ జంట పెళ్లి రాజస్థాన్ లోని సవాయ్ మాధోపూర్ జిల్లా సిక్స్ సెన్స్ పోర్ట్ లో అతి కొద్ది మంది సన్నిహితులు సెలబ్రిటీలు వారి కుటుంబ సభ్యుల మధ్య అంగరంగ వైభవంగా జరిగింది. పెళ్లి తర్వాత నూతన వధువు కత్రినాకైఫ్ తొలిసారిగా తన ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసిన ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

హనీమూన్ కోసం మాల్దీవ్స్ కు వెళ్లిన ఈ జంట మెహందీ తో ఉన్న చేతులు బ్యాక్ గ్రౌండ్ లో సముద్రతీరం ఉన్న ఫోటోను షేర్ చేశారు. ఈ ఫోటో పైన నెటిజన్స్ లవ్లీ మాల్దీవ్స్, లవ్లీ లైఫ్ అంటూ కామెంట్ చేస్తున్నారు. ఇంకొందరు ఈ జంటకు హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అంటూ కామెంట్ చేస్తున్నారు. ఈ ఫోటోలో మీ రెండు చేతులు కనిపిస్తూ ఉన్నాయి. మరి ఫోటో విక్కీ తీశారు కదా అంటూ ఫన్నీ గా కామెంట్స్ చేస్తున్నారు. ఇంకొక నిజం అయితే నన్ను వదిలేసి వెళ్లావు గా అంటూ కొద్దిగా కామెంట్ చేశాడు. కత్రినా చేసిన ఈ ఫోటోకు 21 గంటల్లోనే దాదాపుగా 38 లక్షలకు పైగా లైక్స్ వచ్చాయి.

Share.