మిల్క్ బాయ్ మహేష్ చాలా చాలా బిజీ బిజీగా గడిపేస్తున్నాడు. ప్రస్తుతం మహేష్ మహర్షి’ సినిమాతో తీరిక లేకుండా ఉన్నాడు. ఈ సినిమా పూర్తవ్వగానే సుకుమార్ డైరెక్షన్ లో మరో సినిమా చేసేందుకు ప్లాన్ చేసుకున్నాడు. అయితే ఈ సినిమా ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో ఉండబోతున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమాకి మరింత హైప్ తీసుకురావడానికి బాలీవుడ్ టాప్ హీరోయిన్ ను రంగంలోకి దించాలని ఆ చిత్ర యూనిట్ చూస్తుందట.
ఈ నేపథ్యంలోనే… మహేష్ సరసన నటించేందుకు కత్రినా కైఫ్ ను సంప్రదించినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ వార్తలు కొట్టిపారెయ్యడానికి లేదు. ఎందుకంటే…ఈ విషయంపై ఇటీవల మీడియాతో మాట్లాడిన కత్రినా … ఈ సినిమా గురించి క్లారిటీ ఇచ్చింది. ప్రస్తుతం సల్మాన్ ఖాన్ హీరోగా నటిస్తున్న ‘భరత్’ సినిమా తరువాత ఏ సినిమా ఒప్పుకోలేదని చెప్పుకొచ్చింది.
అలాగే మహేష్ బాబు సినిమా గురించి తనకు ఎలాంటి ఆఫర్ ఇంకా రాలేదని తనను ఇంకా ఎవరూ అడగలేదని కుండబద్దలు కొట్టింది. ఇంతకుముందు వెంకటేష్ సరసన ‘మల్లీశ్వరి’ సినిమాలో మరియు బాలకృష్ణ ‘అల్లరి పిడుగు’ సినిమాలో నటించిన కత్రినాకైఫ్ మళ్లీ తెలుగులో ఎప్పుడు నటిస్తుందో మహేష్ సినిమాలో ఆఫర్ వస్తే నటిస్తుందో లేదో చూడాలి.