పటాస్ తర్వాత కళ్యాణ్ రాం సూపర్ హిట్ కొట్టిన సినిమా 118. 6 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన ఈ సినిమ 10 కోట్ల వసూళ్లు తెచ్చింది. అంతేకాదు డిజిటల్, శాటిలైట్ రైట్స్ రూపంలో కూడా మంచి లాభాలు తెచ్చి పెట్టింది. ఇక ప్రస్తుతం కళ్యాణ్ రాం నూతన దర్శకుడు వేణు మల్లిడి డైరక్షన్ లో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకు టైటిల్ గా తుగ్లక్ అని పెట్టారని తెలుస్తుంది.
పిరియాడికల్ మూవీగా వస్తున్న ఈ సినిమాకు 20 కోట్ల బడ్జెట్ కేటాయించారట. ఎన్.టి.ఆర్ ఆర్ట్స్ బ్యానర్ లో నందమూరి కళ్యాణ్ రాం స్వయంగా ఈ సినిమా నిర్మిస్తారని తెలుస్తుంది. ఇక ఈ సినిమాలో హీరోయిన్స్ గా రకుల్ ప్రీత్ సింగ్, కేథరిన్ త్రెసాలు సెలెక్ట్ అయ్యారట. ఎన్.టి.ఆర్ తో నాన్నకు ప్రేమతో సినిమాలో నటించిన రకుల్ ఇప్పుడు మరో నందమూరి హీరోతో జోడీ కడుతుంది.
ఎన్.టి.ఆర్ కథానాయకుడు సినిమాలో శ్రీదేవిగా కూడా బాలయ్య పక్కన స్టెప్పులేసింది రకుల్. కేథరిన్ త్రెసా ఈమధ్య కాస్త వెనుకపడ్డట్టు కనిపించినా మళ్లీ ఇప్పుడు వరుస సినిమాలు చేస్తుంది. మరి కళ్యాణ్ రాం తో రకుల్, కేథరిన్ చేసే రొమాన్స్ ఎలా ఉంటుందో చూడాలి.