టాలీవుడ్ చందమామ అందాల భామ కాజల్ అగర్వాల్ ఇండస్ట్రీకి వచ్చి 10 ఏళ్లు పూర్తయినా కూడా ఆమెకున్న క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. ఇప్పటికీ తెలుగులో టాప్ హీరోయిన్లలో కాజల్ ఉండటం నిజంగా విశేషం అని చెప్పాలి. యంగ్ హీరోలు మొదలుకుని టాప్ స్టార్ హీరోల వరకు అందరితో ఈ భామ నటించి మెప్పించింది. ఇప్పుడు చాలా సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తూ తన సత్తా చాటుతోంది కాజల్. అయితే ఒక హీరో పేరు చెప్పగానే అమ్మడు ఉన్నపలంగా సినిమాను రిజెక్ట్ చేసి టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది.
అ! వంటి విభిన్న సినిమాతో వచ్చి ప్రేక్షకులను మెప్పించిన డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తన నెక్ట్స్ మూవీలో హీరోయిన్‌గా నటించాలని కాజల్ దగ్గరకు వెళ్లాడట. అయితే ప్రశాంత్ వర్మతో సినిమా చేయడానికి తాను సిద్ధంగా ఉన్నట్లు తెలిపింది. కానీ ఈ సినిమాలో హీరో రాజశేఖర్ పేరు వినగానే వెంటనే సినిమా చేయనంటూ రిజెక్ట్ చేసి అందరికీ షాక్ ఇచ్చింది. ఇటీవల ‘గరుడవేగ’తో బాక్సాఫీస్ దగ్గర హిట్ అందుకున్న రాజశేఖర్ చాలా గ్యాప్ తరువాత మళ్లీ ట్రాక్‌లోకి వచ్చాడు.
అయితే రాజశేఖర్ పేరు వినగానే సినిమాను రిజెక్ట్ చేసిన కాజల్ దానికి కారణం మాత్రం డేట్స్ ఖాళీగా లేవని చెప్పింది. మొత్తానికి కాజల్ సీనియర్ హీరోలతో నటిస్తే తన ఇమేజ్ డ్యామేజ్ అవుతుందని బాగా నమ్ముతున్నట్లు కనిపిస్తోంది. అందేకే బహుశా రాజశేఖర్ లాంటి హీరోకు నో చెప్పి ఉండొచ్చు అంటున్నారు క్రిటిక్స్.