అందాల భామ కాజల్ అగర్వాల్‌కు తెలుగు ప్రేక్షకుల్లో మంచి ఫాలోయింగ్ ఉన్న సంగతి తెలిసిందే. ఈ బ్యూటీ ఏదీ చేసినా చాలా బాగా రిసీవ్ చేసుకుంటారు తెలుగు ఆడియెన్స్. తాజాగా ఈ అమ్మడు వీల్‌చేర్‌పై కూర్చుని ఒక ఫీట్ చేసింది. ఇది చూసిన ప్రేక్షకులు ఒక్కసారిగా షాక్ అయ్యారు.
కాజల్ వీల్‌చేర్ పై ఎందుకు కూర్చుంది అనుకుంటున్నారా..? అసలు సంగతి ఏమిటంటే.. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కీకీ ఛాలెంజ్ మేనియా వ్యాపించి ఉంది. సాధారణ పబ్లిక్ దగ్గర్నుండి సెలిబ్రిటీల వరకు అందరూ దీన్ని చేసి చూపిస్తున్నారు. కదులుతున్న వాహనం నుండి దిగి డ్యాన్స్ చేయడమే ఈ కీకీ ఛాలెంజ్. అయితే ఇలాంటివి చేస్తే ప్రమాదాలు జరుగుతాయనే మంచి ఉద్దేశ్యాన్ని తెలిపేందుకే కాజల్ ఇలా వీల్ చేర్‌పై ఈ ఛాలెంజ్‌ను పూర్తి చేసింది. బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌తో కలిసి ఈ కీకీ ఛాలెంజ్ చేసింది కాజల్.
దర్శకుడు తేజ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న కొత్త చిత్రంలో బెల్లంకొండ శ్రీనివాస్ సరసన కాజల్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్ర సెట్స్‌లోనే కాజల్ ఈ ఫీట్ చేసింది. మొత్తానికి కాజల్ అందరిలా కాకుండా తాను వెరైటీ అని ప్రూవ్ చేసింది.