కాజల్- బెల్లంకొండ మధ్య సంథింగ్ సంథింగ్ …?

Google+ Pinterest LinkedIn Tumblr +

సినీ రంగంలో ఉన్నవారికి లవ్ ఎఫైర్స్ కొత్తేమీ కాకపోయినా…. టాప్ హీరోయిన్ కి యంగ్ హీరోకి అందులోనూ వయస్సులో చిన్నవాడితో ఎఫైర్ ఉన్నట్టు గాసిప్స్ వస్తే మాత్రం అది కాస్త విచిత్రమైన వార్తే .ఇప్పుడు అటువంటి విచిత్రమైన వార్త టాలీవుడ్ లో చక్కెర్లు కొడుతోంది. టాలీవుడ్ బడా నిర్మాత బెల్లంకొండ సురేష్ కొడుకు శ్రీనివాస్ టాలీవుడ్ లో టాప్ హీరో అవ్వాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్న… ఆశించిన స్థాయిలో సక్సెస్ అవ్వలేకపోతున్నాడు. శ్రీనివాస్ నటించిన సినిమాలన్నీ… యావరేజ్ టాక్ తెచ్చుకున్నాయి కానీ.. చెప్పుకోదగిన స్థాయిలో మాత్రం హిట్ కొట్టలేకపోయాడు.

రీసెంట్ గా రిలీజ్ అయిన కవచం సినిమా కూడా పెద్దగా వర్కవుట్ కాలేదు. కానీ హీరోయిన్ కాజల్ తో మాత్రం బాగానే వర్కవుట్ అవుతుంది. వీరిద్దరు ఎక్కడ చూసినా తెగ కనిపించేస్తున్నారు. ప్రతి పార్టీలోను వీరిద్దరిదే హవా కనిపిస్తుంది. ఇప్పుడు ఈ ఇద్ద‌రూ పుల్‌గా దోస్తులు అయిపోయారు. అందుకే క‌లిసి మ‌జా చేస్తున్నారు. ఆ మ‌ధ్య కిలికి ఛాలెంజ్ అప్పుడు కూడా బెల్లంకొండ‌తో క‌లిసి డాన్సులు చేసింది కాజ‌ల్.

అయితే…. ఇప్పటి వరకు ఏ హీరోతోను కాజల్ ఈ రేంజ్ లో తిరగలేదు కానీ బెల్లంకొండతో మాత్రం కలిసి బహిరంగంగానే షికార్లు చేసేస్తోంది కాజల్. అయితే వీరిద్దరి మధ్య ఏదో లవ్ ఎఫైర్ ఉన్నట్టు గుసగుసలు కూడా మొదలయ్యాయి. తాజాగా వీరిద్దరి క్లోజ్ నెస్ అందరికి తెలిసేలా బయటకి వచ్చిన ఫోటో ఈ రూమర్ కు మరింత బలం చేకూరుస్తోంది. వీరిద్దరి మధ్య ఉన్నది క్లోజ్ ఫ్రెండ్ షిప్ నా లేక సంథింగ్ సంథింగ్ నా అనేది తెలుసుకోవడానికి మరికొద్ది రోజులు వెయిట్ చేయాలేమో.

Share.