ప్రభాస్ ఇష్టపడ్డాడు..తీసుకెళ్లాడు!

Google+ Pinterest LinkedIn Tumblr +

బాహుబలి సినిమా తర్వాత యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కి జాతీయ స్థాయిలో ఎంతో క్రేజ్ ఏర్పడింది. ఆయన నటించే సినిమాలు తెలుగులోనే కాదు అన్ని భాషల్లో రిలీజ్ చేసేందుకు దర్శక, నిర్మాతలు ఉత్సాహం చూపిస్తున్నారు. ఈ నేపథ్యంలో సుజిత్ దర్శకత్వంలో ప్రభాస్, శ్రద్దా కపూర్ జంటగా ‘సాహూ’సినిమా తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే.

ఈ సినిమా రూ.200 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ దాదాపు ముగింపు దశకు వచ్చిందని టాలీవుడ్ టాక్. ఈ సినిమాలో భారీ యాక్షన్ సన్నివేశాల కోసం కార్లు, బైక్స్ వాడిన విషయం తెలిసిందే. ఇక షూటింగ్ జరిగే సమయంలోనే ప్రభాస్ ఓ కారు, బైక్ పై మనసు పడ్డాడట.

ఇంకేముంది అవి సాహూ సినిమా జ్ఞాపకంగా తన ఇంటికి తీసుకువెళ్తానని చెప్పడం..వారు ఓకే అనడం కూడా జరిగిపోయిందట. సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నీల్ నితిన్, ఎవ్లిన్ శర్మ, మందిరా బేడీ, జాకీ ష్రాఫ్ తదితరులు నటిస్తుండగా, ఆగస్టు 15న సినిమా విడుదల కానుంది.

Share.