టాలీవుడ్ కి దెబ్బేసిన ఇలియానా !

Google+ Pinterest LinkedIn Tumblr +

టాలీవుడ్ లో ఒక వెలుగు వెలిగి ఆ తరువాత కొంత విరామం ప్రకటించి మళ్ళీ టాలీవుడ్ కి వచ్చిన పోకిరి భామ ఇలియానా మలీయే తెలుగు తెర మీద బిజీ అవుతుందని అంతా భావించారు. అయితే ఆమె మాత్రం మళ్ళీ బాలీవుడ్ బాట పట్టారు. ఇక్కడికంటే బాలీవుడ్ బెటర్ అనుకుందో ఏమో కానీ ఆమె ప్రస్తుతానికి ఓ హింది మూవీకి కాల్షీట్లు కేటాయించినట్లు తెలుస్తోంది. తాజాగా… రవితేజ నటించిన ‘అమర్ అక్బర్ అంటోనీ’ చిత్రంతో టాలీవుడ్ లో రీఎంట్రీ ఇచ్చింది ఈ భామ.

అనీస్ బజ్మీ అనే దర్శకుడు రూపొందిస్తోన్న సినిమాలో హీరోయిన్ గా ఇలియానాను సంప్రదించారట. దానికి ఆమె అంగీకరించడంతో అగ్రిమెంట్ కూడా రాసుకున్నారని తెలుస్తోంది. గతంలో ఈ దర్శకుడితో కలిసి పని చేసిన అనుభవం ఉండడంతో అతడి తాజా సినిమాకు కూడా ఈమె వెనుక ముందు చూడకుండా ఒకే చెప్పినట్టు సమాచారం.

ఈ సినిమాలో ఆమె పక్కన జాన్ అబ్రహం హీరోగా కనిపించనున్నారు. త్వరలోనే సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. అయితే ఈ సినిమా కారణంగా ఇలియానాకి మళ్లీ తెలుగులో గ్యాప్ తప్పేలా లేదు. పైగా ఆమె గ్లామరస్ రోల్స్ కాకుండా మంచి పాత్రల కోసం ఎదురుచూస్తున్నట్లు చెప్పింది. ఇలియానా బాలీవుడ్ లోకి అడుగుపెట్టడం ఐడెమ్ కొత్త కాదు. ఆమె మొట్టమొదటి చిత్రం బర్ఫీ, రుస్టాస్ట్, ముబారక్ వంటి సినిమాలు ఆమెకు ఎంతో పేరు తెచ్చాయి.

Share.