25 ఏళ్లు వచ్చిన నేనింకా వర్జిన్ నే: విజయ్ దేవరకొండ

Google+ Pinterest LinkedIn Tumblr +

విజయ్ దేవరకొండ ఇప్పుడు తెలుగు యూత్ లో మంచి క్రేజ్ ఉన్న హీరో, ముఖ్యంగా ఈ యువ కథానాయకుడికి యువతుల్లో చాల మంచి ఫాలోయింగ్ ఉంది. కేవెలం ఒకే ఒక సినిమా ‘అర్జున్ రెడ్డి’ తనకి తిరుగులేని స్టార్ డాం ని తెచ్చి పెట్టిందనే చెప్పాలి. ఈ సినిమా హిట్ తో విజయ్ కి వరుస అవకాశాలు వచ్చి పడుతున్నాయి. ఇక ఇప్పుడు విజయ్, రష్మిక జంటగా నటించిన తాజా చిత్రం ‘గీత గోవిందం’ విడుదలకి సిద్ధం గా ఉంది. ఈ సినిమాని ఆగష్టు 15 వ తేదీన విడుదల చేయనున్నట్టు చిత్ర బృందం ఈ రోజు ఒక ఆఫీషియల్ పోస్టర్ ద్వారా తెలియ చేసారు.

ఇప్పటికే ఈ సినిమాకి పలు విధాలుగా ప్రమోషన్ చేస్తున్న చిత్ర యూనిట్ ఇవాళ విడుదల చేసిన పోస్టర్ లో కూడా నెటిజన్స్ ని ఆకట్టుకునేలా రూపొందించారు. ఈ పోస్టర్ లో విజయ్ ” న వయసు 25 సంవత్సరాలు’ కానీ నేను ఇంకా వర్జిన్ నే మేడం” అని రాసి ఉంటుంది. ఈ సరదా పోస్టర్ చూసి ఈ సినిమా పూర్తి కామెడీ తో కూడుకున్న ప్రేమ కథ చిత్రం అని అర్ధం అవుతుంది. పరశురాం దర్శకత్వంలో గీతా ఆర్ట్స్ బ్యానర్ లో అల్లు అరవింద్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు.

Share.