నిర్మాతలకు నేను పూర్తిగా సహకరిస్తా అంటున్న హీరోయిన్..!

Google+ Pinterest LinkedIn Tumblr +

అతి తక్కువ కాలంలోనే తమిళంలో స్టార్ హీరోయిన్ గా క్రేజ్ తెచ్చుకున్న అమలా పాల్ డైరక్టర్ విజయ్ తో లవ్ మ్యారేజ్ జరుగగా.. ఆ తర్వాత రెండేళ్లకే వాళ్లు విడిపోయారు. డైవర్స్ తర్వాత మళ్లీ సినిమాల మీద ఫోకస్ పెట్టిన అమలా పాల్ ఇదవరకు గ్లామర్ విషయంలో వెనుకడుగు వేసేది కాని ఇప్పుడు స్కిన్ షోకి ఏమాత్రం అడ్డు చెప్పట్లేదు. ఆడై సినిమా కోసం ఏకంగా న్యూడ్ గా నటించిన అమలా పాల్ అందరిని షాక్ కు గురి చేసింది.

ఆ సినిమాలో అలా నటించినందుకు గాను అమలా పాల్ మరో సినిమా ఆఫర్ మిస్సయిందట. విజయ్ సేతుపతి హీరోగా వస్తున్న ఓ సినిమాలో హీరోయిన్ గా అమలా పాల్ ను అనుకున్నారు కాని ఆ సినిమా హీరోయిన్ గా అమలా పాల్ ను మేఘా ఆకాశ్ రీప్లేస్ చేసింది. అమలా పాల్ ను తీసేయడానికి కారణం అమలా పాల్ రెమ్యునరేషన్ భారీగా డిమాండ్ చేసిందని తెలుస్తుంది. అయితే అమలా పాల్ మాత్రం ఆ వార్తలను ఖండించింది.

తాను నిర్మాతలకు ఎప్పుడు సహకరిస్తానని.. వారు ఇచ్చినంత తీసుకుంటానని అంటుంది. అయితే అమల పాల్ ఆడై సినిమా కోసం న్యూడ్ గా నటించడం ఆ సినిమా నిర్మాతలకు నచ్చలేదట. అందుకే అమలాని సినిమా నుండి తొలగించారని టాక్. ఏది ఏమైనా ఆడై సినిమా కోసం అమలా చాలా రిస్క్ చేసిందని చెప్పొచ్చు.

Share.