సినిమాల్లో హీరోయిన్ ఛాన్స్… అమ్మాయిల‌తో వ్య‌భిచారం..

Google+ Pinterest LinkedIn Tumblr +

ప్ర‌స్తుతం మారుతోన్న స‌మాజంలో మోస‌గాళ్లు, మాయ‌లోల్లు పెరిగిపోతున్నారు. కళ్లు మూసి తెరిచేలోపు మోసాలు చేసి పారిపోతారు. ఏ మాత్రం ఏమ‌రుపాటుగా ఉన్నా స‌ర్వం కోల్పోవాల్సిందే. ఇక సినిమా ప్ర‌పంచం అంటేనే రంగుల ప్ర‌పంచం. చాలా మంది అమ్మాయిల బ‌ల‌హీన‌త‌ల‌ను ఆస‌ర‌గా చేసుకుని వారికి షార్ట్ ఫిల్మ్‌ల‌లోనూ, సినిమాల్లో హీరోయిన్లుగా ఛాన్సులు ఇప్పిస్తామంటూ వారికి ల‌గ్జ‌రీ లైఫ్ ఎర‌వేసి వ్య‌భిచార కూపంలోకి దింపుతున్నారు.

నెల్లూరులో జ‌రుగుతోన్న ఈ తంతును పోలీసులు గుట్టు చేశారు. అస‌లు విష‌యంలోకి వెళితే ఓ మోసగాడు షార్ట్‌ ఫిల్మ్స్, సినిమాల్లో అవకాశం ఇప్పిస్తానంటూ మైనర్‌ బాలికలు, యువతులకు ఎరవేస్తాడు. అనంతరం వారికీ డబ్బు ఆశ కలిపించి లైంగికంగా అనుభవిస్తాడు. అది అంత రహస్య కెమెరాల్లో చిత్రీకరించి.. అవి చూపి వారిని బలవంతంగా వ్యభిచార కూపంలోకి దించుతున్నాడు. ఆ వ్యక్తి గుట్టును నెల్లూరు పోలీసులు బయట పెట్టారు.

నెల్లూరుకు చెందిన ఓ బాలిక ఇలాగే మోస‌పోవడంతో పోలీసుల‌కు ఫిర్యాదు చేసింది. జిల్లా ఎస్పీ ఐశ్వర్యరస్తోగి ఆదేశాలతో టాస్క్‌ఫోర్స్‌ ఇన్‌స్పెక్టర్‌ ఐ.శ్రీనివాసన్, నగర పోలీసు అధికారులతో ప్రత్యేక బృందం ఏర్పాటు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ప్ర‌త్యేక నిఘాతో వీరి గ‌ట్టును ర‌ట్టు చేశారు.
దీంతో ఒకొక్కరుగా ప్రధాన నిందితుడు వరుకు అందరూ బయటకు వచ్చారు. ఈ వ్యభిచార గృహాలు గ‌త నాలుగు సంవ‌త్స‌రాలుగా న‌డుస్తున్న‌ట్టు పోలీసులు గుర్తించారు.

కాగా ఈ వ్యవహారంలో కొందరు మీడియా ప్రతినిధులు కూడా ఉన్నారని పోలీసులు తెలిపారు. అయితే నిందితుల నుంచి ఓ కారు, ల్యాప్‌టాప్, మోటార్‌బైక్, 14 సెల్‌ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేశారు.

Share.