డబ్బులిస్తే అన్ని బాగానే ఉంటాయ్: హెబ్బా పటేల్

Google+ Pinterest LinkedIn Tumblr +

నటి హెబ్బా పటేల్ టాలీవుడ్ కి ‘ కుమారి 21 ఎఫ్ ‘ ద్వారా పరిచయం అయినా విషయం తెలిసిందే, అతి తక్కువ కాలంలోనే తన కంటూ ప్రత్యకమైన గుర్తింపు సంపాదించుకున్నారు హెబ్బా పటేల్. అయితే తాను నటించిన గత కొన్ని చిత్రాలు సరైన విజయం సాధించలేకపోయాయి. అప్పటి నుండి ఈ అమ్మడు కొంచం బోల్డ్ మరియు ఘాటైన సన్నివేశాలు ఉన్న సినిమాలు చేయటం ప్రారంభించారు. ఇక తాను నటించిన తాజా చిత్రం `24 కిస్సెస్ ‘ త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ సందర్భంగా జరిగిన విలేకరుల సమావేశం లో నటి హెబ్బా పటేల్ కొన్ని ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ఈ సినిమాలో తనది చాల సింపుల్ అండ్ బోల్డ్ క్యారెక్టర్ అని తెలిపింది. ఈ సినిమాతో నేను నటిగా పరిణితి చెందానని, నిర్మాత డబ్బులు ఇస్తే ముద్దులు పెట్టించుకోవటం కూడా బాగానే ఉంటుందని ఆమె తెలపటంతో అక్కడ ఉన్న వారంతా ఆశ్చర్య పోయారు. ఈ సినిమాలో తన నటన పై ప్రస్తావిస్తూ నేను ఈ సినిమాలో చేసిన పాత్ర పై చాల సంతోషంగా మరియు సంతృప్తిగా ఉన్నానని ఆమె వెల్లడించారు.

అయితే పక్కనే ఉన్న హీరో ఆదిత్ మీరు గుడ్ కిస్సరా..? కాదా ..? తెలపండి అని అడగ్గా దానికి బదులుగా హెబ్బా జవాబిస్తూ “వెన్ యూ పెయిడ్ ఎనీథింగ్ ఈజ్ గుడ్” ( డబ్బులు ఇస్తే ఏదైనా బాగానే ఉంటుంది అని సమాధానం చెప్పారు).
మిణుగురులు ఫేమ్ అయోధ్య కుమార్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి, మరి కొన్ని రోజుల్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Share.