నువ్వు ఎగరాలనుకున్నప్పుడు నీ రెక్కను కాలేను: జెనీలియా

Google+ Pinterest LinkedIn Tumblr +

టాలీవుడ్ హీరోయిన్ జెనీలియా మనందరికీ సుపరిచితమే. ఈమె నటించిన బొమ్మరిల్లు సినిమా లో హాసిని పాత్ర అందరికీ గుర్తుండే ఉంటుంది. ఈ పాత్ర ద్వారా జెనీలియా ప్రేక్షకులకు మరింత చేరువ అయ్యింది. బాలీవుడ్ నటుడు రితేష్ దేశ్ ముఖ్ ను ప్రేమ వివాహం చేసుకుంది. ఈ దంపతులకు ప్రస్తుతం ఇద్దరు కుమారులు. అయితే జెనీలియా ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం బాగా యాక్టివ్గా ఉంటూ తన ఫ్యామిలీకి తనకు సంబంధించిన ప్రతి ఒక్క విషయాన్ని షేర్ చేసుకుంటూ ఉంటుంది.

ఈ క్రమంలోనే తాజాగా జెనీలియా పెద్దకుమారుడు రియాన్ ఏడవ పుట్టినరోజు సందర్భంగా ఇంస్టాగ్రామ్ లో ఎమోషనల్ పోస్ట్ చేసింది. కొడుకు పై ప్రేమకురిపిస్తున్న పెట్టిన ఈ పోస్ట్ నెటిజన్లు హృదయాలను హద్దుకుంటోంది.

ప్రియమైన రియాన్.. నీ చిట్టి బుర్రలో ఉన్న బోల్డన్ని కోరికలు, ఆశలను ఖచ్చితంగా నెరవేరుస్తానని ఈ సందర్భంగా నీకు మాట ఇస్తున్నా.. నువ్వు ఎగరాలి అనుకున్నప్పుడు నేను నీ రెక్కను కాలేను కానీ ఆ రెక్కల కింద గాలి అవుతా.. అలాగే ప్రతి విషయంలోనూ నువ్వు మొదటి స్థానంలోనే ఉండాలని నేను కోరుకోను చివరి స్థానంలో ఉన్నా సరే నీ ప్రత్యేకత అని నేను గుర్తిస్తాను. అంతే తప్ప నిరాశ చెందాను.. నీ వెంట ఎప్పుడూ ఉంటాను.. నువ్వు ఒంటరి కాకుండా చూసుకుంటాను.. పుట్టినరోజు శుభాకాంక్షలు రియాన్ ఐ లవ్ యు మై బ్రేవ్ బాయ్ అంటూ ఎమోషనల్ పోస్ట్ చేసింది.

Share.