బ్రహ్మానందం హీరోగా నటించిన ఏకైక చిత్రం ఏంటో తెలుసా..?

Google+ Pinterest LinkedIn Tumblr +

తెలుగు సినీ పరిశ్రమలో కొంతమంది నటులకు మాత్రం కొన్ని ప్రత్యేకమైన పేజీలు ఉంటాయని చెప్పవచ్చు. అలా ఎంతోమంది ఇప్పటివరకు సినీ ఇండస్ట్రీకి పేరు ప్రఖ్యాతలు తెచ్చిన వారు చాలామందే ఉన్నారు. సినీ ఇండస్ట్రీలో ఎవరు ఊహించని స్థాయిలో మంచి క్రేజ్ తెచ్చుకున్న నటుడు బ్రహ్మానందం ప్రతి ఒక్కరికి సుపరిచితమే. ప్రస్తుతం సినిమాలలో హవా కాస్త తగ్గినా గతంలో బ్రహ్మానందం లేకుండా ఏ చిత్రం విడుదల అయ్యేది కాదు. అంతలా తన నటనతో కామెడీతో ప్రేక్షకులను మైమరిపించేలా చేశారు బ్రహ్మానందం. మరీ ముఖ్యంగా చెప్పాలి అంటే బ్రహ్మానందం లేకపోతే సినిమానే ఉండేది కాదని చెప్పవచ్చు.

BABAI HOTEL, Vijayawada - Restaurant Reviews, Phone Number & Photos -  Tripadvisorఅయితే బ్రహ్మానందం గతంలో హీరోగా నటించిన ఒక సినిమా ఉన్నది. ఆ చిత్రమే బాబాయ్ హోటల్.. ఈ సినిమా ఫ్లాప్ గా నిలిచింది. విజయవాడలో బాగా ఫేమస్ అయిన బాబాయి హోటల్ పేరు ఈ చిత్రానికి పెట్టినట్లుగా సమాచారం. బ్రహ్మానందం అప్పటికి కమెడియన్ బీభత్సమైన ఫ్యాన్ ఫాలోయింగ్ కలదు. బ్రహ్మానందం ప్రధాన పాత్రలో, కిన్నెర కీలక పాత్రలో నటించారు. ఈ చిత్రాన్ని జంధ్యాల దర్శకత్వంలో తెరకెక్కించడం జరిగింది. ఈ చిత్రాన్ని క్రియేటివ్ కమర్షియల్ బ్యానర్ మీద స్టార్ ప్రొడ్యూసర్ కెఎస్ రామారావు నిర్మించారు.

Babai Hotel (1992) - IMDb

ఈ చిత్రంలో సుత్తి వేలు, కోట, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, పావలా శ్యామల తదితరులు నటించారు. హోటల్ నడిపే రామచంద్ర మూర్తి.. పేరుకి తగ్గట్టుగా అందరితో మంచిగా ఉంటూ అనాధ పిల్లలను చేరదీసి పెంచుతూ ఉంటారు బ్రహ్మానందం. అలా ఈ సినిమా కథ సాగుతుంది. కథలో ప్రతి క్యారెక్టర్ కి ఇంపార్టెంట్ ఉంటుంది కామెడీ తో పాటు కొన్ని సెంటమెంట్ సీన్లు కూడా బాగానే ఆకట్టుకున్నాయి. కానీ ప్రేక్షకులను మెప్పించడంలో మాత్రం విఫలం అయింది అని చెప్పవచ్చు. ముఖ్యంగా జంధ్యాల దర్శకత్వంలో కమెడియన్ బ్రహ్మానందం హీరో అనేసరికి ఆహ నా పెళ్ళంట సినిమా రేంజ్ లో అందరూ ఊహించుకున్నారు.

End of Brahmanandam era?

అంతేకాకుండా ప్రేక్షకులు ఆశించిన కామెడీ కంటే బరువైన ఎమోషన్లు ఎక్కువగా ఉండటం వల్ల ఈ సినిమా ఫ్లాప్ అయింది. ముఖ్యంగా క్లైమాక్స్ విషాదం గా ముగియడం ప్రేక్షకులకు అప్పట్లోనే నచ్చలేదు. కామెడీ తో పాటు సెంటిమెంట్ సన్నివేశాలలో అద్భుతంగా నటించారు బ్రహ్మానందం.

Share.