యూట్యూబ్ ద్వారా ఆది రెడ్డి నెల సంపాదన ఎన్ని లక్షలో తెలుసా..?

Google+ Pinterest LinkedIn Tumblr +

బుల్లితెరపై ప్రచారమవుతున్న బిగ్ బాస్ షో కి ఎంతోమంది సెలబ్రెటీలు వచ్చి వెళ్లిన సంగతి తెలిసిందే అయితే ఇప్పుడు ఆ షోలో పార్టిసిపెంట్ చేసిన వ్యక్తి గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. బిగ్ బాస్ సీజన్ 6 లో వచ్చిన ఆది రెడ్డి మొదటగా యూట్యూబ్ ద్వారా పరిచయమై ఆ తర్వాత ఈ షోకి ఎంట్రీ ఇచ్చాడు. ఆ షోలో ఆదిరెడ్డి ఎక్కువ రోజులు ఉండరేమో అని అనుకున్నారు కానీ. ఆయన ఆట తీరుతో అందరిని మెప్పించి టాప్-5 లో ఒకరిగా నిలిచాడు. అంతేకాకుండా అతని డాన్స్ చూసి అందరూ ఫిదా అయ్యారు. అలాగే నాగార్జున ఆదిరెడ్డిని పిలిచి మరీ డాన్స్ చేయించుకునే వారు.

Bigg Boss 6 Telugu Launch Updates: Adi Reddy Entered As BB6 18th Contestant  - Sakshi

అయితే అలాంటి ఆదిరెడ్డి బిగ్ బాస్ రివ్యూవర్ కాకముందు చాలా పేదరికంలో ఉండేవాడట. వాళ్ల అమ్మ ఏదైనా ఫంక్షన్ కి వెళ్లాలని అనుకుంటే పక్కింటి వారి నగలు వేసుకొని వెళ్లేదట.అంతేకాకుండా ఆమె ఆత్మహత్య చేసుకోవడానికి వారి పేదరికమే కారణమంటూ కూడా ఆదిరెడ్డి ఆ షోలో తెలిపాడు. అలాగే తన చెల్లెలకి కళ్ళు లేవని బిగ్ బాస్ హౌస్ లో ఎమోషన్స్ అయినా సందర్భాలు కూడా ఉన్నాయి.

ఇదంతా పక్కన పెడితే బిగ్ బాస్ కంటెస్టెంట్ ఆదిరెడ్డి ఒక నెల సంపాదన ఎంతో తెలిస్తే మీరందరూ షాక్ అవ్వాల్సిందే.స్టార్ సెలబ్రెటీల కంటే ఎక్కువగా సంపాదిస్తున్నాడట. అయితే చాలా మంది ఆదిరెడ్డిని డబ్బులు తీసుకొని ఫేక్ రివ్యూలు చెబుతూ ఉంటాడని ఆరోపించారు. అయితే ఆ రివ్యూ కు చెక్ పెట్టేలా అవును నేను ఫేక్ రివ్యూలే చేస్తున్నాను నాకు యూట్యూబ్ ఛానల్ డబ్బులు ఇస్తుందని కుండ బద్ద కొట్టేలా చెప్పేశాడు. ఆది రెడ్డి పెట్టిన లెక్కలు చూస్తుంటే దాదాపు ఆదిరెడ్డికి 39 లక్షలు నెల అధికం కనిపిస్తోంది. ఈ లెక్కల గురించి తెలుసుకున్న వారంతా షాక్ అవుతున్నారు.

గతంలో బిగ్ బాస్ లో పాల్గొన్న కంటెస్టెంట్ల కంటే ఆదిరెడ్డి నెల సంపాదన ఎక్కువగా ఉందని పలువురు నెటిజన్ సైతం కామెంట్స్ చేస్తున్నారు తనకి ఎక్కువగా అమెరికన్ ఫాలోవర్స్ ఉన్నారని వారి వల్లే ఇంత డబ్బు జమ అవుతుందని కూడా తెలియజేయడం జరిగింది ఆదిరెడ్డి.

Share.