ప్రముఖ అందాల నటి తమన్నా భాటియా ప్రస్తుతం సరైన అవకాశాలు లేక సతమతమవుతుంది. ఒకప్పుడు స్టార్ హీరోల సరసన ఆడిపాడిన తమన్నా ఇప్పుడున్న హీరోయిన్లతో పోటీ పడలేక రేస్ లో వెనుక పడిపోయింది. గతంలో తమన్నా కి యూత్ లో ఉన్న క్రేజ్ అంత ఇంత కాదు. ముఖ్యంగా తమన్నా అందాలకి ఆమె చేసే నృత్యాలకి టాలీవుడ్ అభిమానులు ఆమెని ఎంత గానో ఆదరించారు. రామ్ చరణ్ తో నటించిన ‘రచ్చ’ సినిమాలో వాన వాన పాటలో తమన్నా అందాల ఆరబోత మరియు ఆమె చేసిన డ్యాన్స్ కి ఫాన్స్ ఫిదా అయిపోయారు.
కానీ అదంతా ఒకప్పటి మాట, ఇప్పుడు ఈ మిల్కీ బ్యూటీ కి టాలీవుడ్ లో కానీ తమిళ్ లో కానీ సరైన అవకాశాలు లేవు, చేతిలో ఉన్న ఒకే ఒక్క సినిమా వెంకీ, వరుణ్ తేజ్ తో నటిస్తున్న ఎఫ్ 2 మాత్రమే. ఇక ఇప్పుడు తాజా సమాచారం ప్రకారం తమన్నా ప్రభు దేవా హీరోగా నటిస్తున్న సినిమాని సైన్ చేసిందట, పార్తీబన్ ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు. ఒకప్పుడు స్టార్ హీరోలతో చిందేసిన ఈ అమ్మడు అవకాశాలు
లేక ప్రభు దేవా వంటి హీరోతో కూడా నటించటానికి ఒప్పుకోవటం చూసి ఆమె ఫ్యాన్స్ ఏ కాకుండా సినీ ప్రియులు కూడా ఆశ్చర్య పోయారు.
తమన్నాకి అవకాశాలు లేక ఆ సినిమా ఒప్పుకుందా..?
Share.