దేవదాస్‌ నిద్రలేస్తే అంతే సంగతులు!

Google+ Pinterest LinkedIn Tumblr +

టాలీవుడ్‌లో ఈమధ్య కాలంలో మల్టీస్టారర్ చిత్రాలకు ఆదరణ లభిస్తుండటంతో తెలుగు హీరోలు వీటివైపు మక్కువ చూపిస్తున్నారు. తాజాగా స్టార్ హీరో అక్కినేని నాగార్జున మరియు న్యాచురల్ స్టార్ నాని కలిసి ఒక సినిమా చేస్తున్నారు. ఈ సినిమా అనౌన్స్ చేసినప్పట్నుండి జనాల్లో మంచి అంచనాలు ఏర్పడ్డాయి. తొలిసారి నాని ఒక మల్టీస్టారర్ సినిమా చేస్తుండటంతో ఇది ఎలా ఉండబోతుందా అనే ఆసక్తి వారిలో మొదలయ్యింది.

కాగా ఈ సినిమా ఫస్ట్‌లుక్ పోస్టర్ టీజర్‌ మరియు టైటిల్‌ను రిలీజ్ చేశారు చిత్ర యూనిట్. ‘‘దేవదాసు’’ అనే ఇంట్రెస్టింగ్ టైటిల్‌తో ఈ చిత్ర ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేశారు చిత్ర యూనిట్. నట సామ్రాన్ అక్కినేని నాగేశ్వర రావు చేసిన ఆల్‌టైమ్ బ్లాక్‌బస్టర్ మూవీ పేరును ఈ సినిమకు పెట్టడంతో అంచనాలు బాగా పెరిగాయి. ఇక ఈ చిత్ర పోస్టర్‌ టీజర్‌లో నాగార్జున ఒక చేతిలో గన్ మరో చేతిలో మందు బాటిల్ పట్టుకుని నిద్ర పోతుండగా డాక్టర్ అవతారంలో నాని ఆయన పక్కన పడుకున్నాడు. ఈ పోస్టర్ చూస్తుంటే ఇది ఖచ్చితంగా కామెడీ ఎంటర్‌టైనర్‌ మూవీ అని తెలుస్తోంది.

శ్రీరామ్ ఆదిత్య డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాను వైజయంతి మూవీస్ బ్యానర్ ప్రొడ్యూస్ చేస్తుండగా సెప్టెంబర్ 27న ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది. మరి ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

Share.