మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘ సైరా నరసింహ రెడ్డి ‘ ఈ చిత్రాన్ని దర్శకుడు సురేందర్ రెడ్డి తెరకెక్కిస్తున్నారు. ఇక ఈ సినిమాకి జాతీయ స్థాయిలో క్రేజ్ తీసుకు రావటానికి చిత్ర బృందం భారీ తారాగణం ని చిత్రం కోసం ఎంపిక చేసింది. ఇక అందులో భాగంగా తమిళం నుండి యంగ్ హీరో విజయ్ సేతుపతి ని, కన్నడం నుండి కిచ్చ సుదీప్ కి ఈ చిత్రం లో కీలక పాత్రలు ఇవ్వటం జరిగింది.
ఇక బాలీవుడ్ మెగా స్టార్ అమితాబ్ బచ్చన్ ఈ సినిమాలో ఒక ముఖ్య భూమిక పోషిస్తున్న విషయం తెలిసిందే, కొద్దీ నెలల క్రితం అమితాబ్ అందుకు సంబంధించిన చిత్రాలను కూడా లీక్ చేయటం జరిగింది. ఇక అమితాబ్ వంటి నటుడు తెలుగు సినిమాలో నటిస్తుండటంతో అయన ఈ చిత్రానికి ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటున్నారో అనే ఒక సందేహం అందరికి ఉంటుంది. అయితే చిరు తో ఉన్న స్నేహం దృష్ట్యా అమితాబ్ ఈ సినిమాకి ఎటువంటి రెమ్యునరేషన్ తీసుకోలేదని సమాచారం. అయితే చిరు మాత్రం అమితాబ్ మీద ఉన్న గౌరవం తో ఆయనకి సుమారు రూ 3 . 2 కోట్ల విలువైన జ్యువెలరీ బాహుమానం కింద ఇచ్చారని ఇండస్ట్రీ వర్గాల సమాచారం.