టాలీవుడ్ లో ప్రస్తుతం ‘మా’ (మూవీ ఆర్టిస్ అసోసియేషన్) లో వర్గ విబేధాలు చిలికి చిలికి గాలివానలా కాకుండా పెను తుఫానులా మారిపోయాయి. మా సభ్యులు సీనియర్ నటుడు నరేష్, శివాజీ రాజా పై పెద్ద ఎత్తున విమర్శలు చేసిన విషయం తెలిసిందే. అయితే నిన్న జరిగిన ప్రెస్ మీట్ లో శివాజీ రాజా, హీరో శ్రీకాంత్ ఒక్క పైసా దుర్వినియోగం జరిగినట్టు నిరూపించిన తాను రాజీనామా చేస్తానని హీరో శ్రీకాంత్ వెల్లడించగా, అదే విలేకరుల సమావేశంలో శివాజీ రాజా నిధుల దుర్వినియోగం ఉందని నిరూపిస్తే తన ఆస్తి అంతా రాసి ఇచ్చేస్తానని తెలిపారు.
ఇక ఈ రోజు ఉదయం నటుడు చిరంజీవి, సీనియర్ మా అధ్యక్షులు నరేష్ తో మాట్లాడారని శివాజీ రాజా కి తన మధ్య మొదట కాంప్రమైజ్ అయ్యే లాగ చేశారట, ఇక తర్వాత అసలు యు ఎస్ ఏ లో జరిగిన ఈవెంట్ కి మొత్తం ఖర్చుల వివరాలు, దాని తాలూకు డాక్యుమెంట్స్ కూడా చిరంజీవి గారు పరిశీలించారట. ఇక ఈ విషయం పై చిరంజీవి, మరియు అల్లు అరవింద్, సురేష్ బాబు ఈ రోజు లేక రేపటి లోగ మీడియా ముందుకు వచ్చే అవకాశం ఉందని సమాచారం.