సైరా లో చిరు లుక్ ఇదే..మెగా ఫ్యాన్స్ కి పండగే

Google+ Pinterest LinkedIn Tumblr +

మెగాస్టార్ చిరంజీవి సినీ కెరీర్ లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం ‘సైరా నరసింహ రెడ్డి’. ప్రముఖ మాస్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ ఈ చిత్రం లో చిరంజీవికి గురువు పాత్ర పోషిస్తున్నారని ఇండస్ట్రీ టాక్. మెగా అభిమానులు కూడా ఈ చిత్రం గురించి వచ్చే ప్రతి చిన్న న్యూస్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

తాజాగా ఈ రోజు ఉదయం ఈ చిత్రానికి సంబంధించిన కొన్ని ఫోటోలు నెట్ లో హాల్ చల్ చేస్తున్నాయి. అవి ఈ చిత్రంలోని యుద్ధ నేపథ్యంలో వచ్చే సన్నివేశాలకు సంబంధిన పిక్స్ గా ఉన్నాయ్. తాజా ఫోటోలు బట్టి సైరా సినిమాని ఎంత భారీ గా నిర్మిస్తున్నారో అర్ధం అవుతుంది. సైరా సినిమాకి యాక్షన్ సన్నివేశాలని రూపొందించిన వ్యక్తి కూడా ఈ పిక్స్ లో దర్శనం ఇచ్చారు. తాజా షెడ్యూల్ తో సినిమా షూటింగ్ 30 శాతం వరకు పూర్తయిందని సమాచారం.

Share.