కొరటాల శివ, చిరంజీవి మూవీ.. ఠాగూర్ తో పోలిక పెడుతున్నారు..!

Google+ Pinterest LinkedIn Tumblr +

మెగాస్టార్ చిరంజీవి సైరా నరసిం హా రెడ్డి సినిమా తర్వాత కొరటాల శివ డైరక్షన్ లో మూవీ చేస్తాడని తెలుస్తుంది. భరత్ అనే నేను తర్వాత కొరటాల శివ చిరంజీవి కోసం ఓ అద్భుతమైన కథ సిద్ధం చేశారట. తన ప్రతి సినిమాలో సోషల్ మెసేజ్ ఉండేలా చూసుకునే కొరటాల శివ ఈసారి కూడా అలాంటి కథతోనే వస్తున్నారని తెలుస్తుంది. ఇక ఈ సినిమాలో చిరంజీవి డ్యుయల్ రోల్ పోశిస్తాడని తెలుతుంది. సైరా పూర్తి చేసిన వెంటనే ఈ కాంబినేషన్ లో మూవీ మొదలవుతుందట.

అయితే ఈ సినిమా కథ కాస్త అటు ఇటుగా ఠాగూర్ సినిమా కథకు దగ్గర పోలికలు ఉంటాయట. అవినీతి, లంచగొండి తనం మీద మురుగదాస్ తీసిన రమణ సినిమాను తెలుగులో రీమేక్ చేశారు. వినాయక్ డైరక్షన్ లో వచ్చిన ఈ సినిమా చిరంజీవి కెరియర్ లో క్రేజీ హిట్ గా నిలిచింది. మరి ఆ సినిమాతో కొరటాల శివ సినిమాను పోల్చి చూస్తున్నారు. అయితే ఈ కథ కూడా అవినీతి రాజకీయాల మీద, లంచగొండితనం మీద రాసుకుని ఉంటాడని చెబుతున్నారు.

మిర్చి నుండి భరత్ అనే నేను వరకు వరుస సినిమాలు హిట్లు కొడుతున్న కొరటాల శివ ఈసారి మెగాస్టార్ తో మెగా మూవీ ప్లాన్ చేస్తున్నారట. ఖైది నంబర్ 150తో సత్తా చాటిన చిరంజీవి ఈసారి సైరాతో మరిన్ని సంచలనాలకు సిద్ధమయ్యాడు. కొణిదెల ప్రొడక్షన్స్ లోనే సైరా వస్తుండగా ఇప్పుడు కొరటాల శివ సినిమాను కూడా కొణిదెల ప్రొడక్షన్స్ లో వస్తుందట. ఠాగూర్ తో చిరు సంచలన విజయం అందుకోగా కొరటాల శివ సినిమాతో ఎలాంటి సత్తా చాటుతాడో చూడాలి.

Share.