చిన్న పాపను దత్తకు తీసుకున్న బండ్ల గణేష్.. ఎవరంటే..?

Google+ Pinterest LinkedIn Tumblr +

ప్రముఖ నటుడిగా సినిమా ఇండస్ట్రీకి లోకి అడుగుపెట్టిన బండ్ల గణేష్ ఆ తర్వాత కమెడియన్ గా, నిర్మాతగా మారి ఎన్నో విజయవంతమైన చిత్రాలను నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఎక్కువగా పవన్ కళ్యాణ్ సినిమాలకు నిర్మాతగా వ్యవహరించడం గమనార్హం. అంతేకాదు పవన్ కళ్యాణ్ కి బండ్ల గణేష్ వీరాభిమాని అన్న విషయం తెలిసిందే. బండ్ల గణేష్ ప్రస్తుతం నిర్మాతగానే ఒకవైపు గుర్తింపు తెచ్చుకుంటూనే, మరొకవైపు హీరోగా ఒక సినిమాలో నటించడానికి సిద్ధం అయ్యాడు.డేగల బాబ్జీ గా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు బండ్ల. క్రైమ్‌, సస్పెన్స్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రానికి వెంకట్‌ చంద్ర దర్శకత్వం వహించారు. ఇటీవల మూవీ ట్రైలర్ విడుదల కాగా, ఇది బాగా ఆసక్తిని పెంచింది.

బండ్ల గణేష్ రాజకీయాలలో కూడా తన కంటూ ఒక చెరగని ముద్ర వేసుకున్నారు. సినిమాలతోనే కాకుండా సేవా కార్యక్రమాలతో కూడా తన గొప్ప మనసును చాటుకుంటూ ఉంటారు. కరోనా సమయంలో తన వంతు సాయంగా కొంత మందికి సహాయం చేసిన బండ్లగణేష్ .. ప్రస్తుతం ఒక నేపాలి అమ్మాయిని దత్తత తీసుకొని ఆశ్చర్యపరిచారు. ఒక నేపాలి పాపకి తన తల్లి కేవలం పాలు మాత్రమే పట్టేది.. ఆ పాప ఆకలికి తట్టుకోలేక బాగా ఏడుస్తూ ఉంటే, మా ఆవిడ ఆ పాప బాధ చూసి తట్టుకోలేక పెంచుకుందామని చెప్పింది. ఇక అలా ఆ పాపను మేము దత్తత తీసుకున్నాం అని తెలిపారు. పాప పూర్తి బాధ్యత ను తీసుకొని బాగా చదివించి , ఉన్నతంగా బ్రతికెలా , అందరిని బెదిరించే స్థాయికి చేరేలా చేస్తాను అంటూ బండ్లగణేష్ తెలిపాడు.

Share.