ఆచార్య సినిమా నుండి సిద్దు ఎంట్రీ..టీజర్ రిలీజ్..?

Google+ Pinterest LinkedIn Tumblr +

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం ఆచార్య. ఈ సినిమాకు టాలీవుడ్ సక్సెస్ఫుల్ డైరెక్టర్ గా పేరు పొందిన కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి కి జోడీగా కాజల్ అగర్వాల్ నటిస్తోంది. ఇక ఈ సినిమాలో మరొక హీరో రామ్ చరణ్ కూడా నటిస్తున్నాడు. ఈయనకు జోడిగా పూజా హెగ్డే నటిస్తోంది.

ఇక ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు కొరటాల శివ. ఈ సినిమాకి నిర్మాతగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ వ్యవహరిస్తుండడం గమనార్హం. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తి కాగా విడుదలకు కూడా సిద్ధంగా ఉన్నది. అయితే తాజాగా ఈ సినిమా నుంచి మరొక బిగ్ అప్డేట్ రానే వచ్చింది. ఈ సినిమాలో రామ్ చరణ్ సిద్ధార్థ సాగా గా నటిస్తున్నారు. అందుకోసమే ఒక స్పెషల్ టీజర్ ను కూడా విడుదల చేసింది చిత్రబృందం. ఇక ఈ టీచర్లు రామ్ చరణ్ చాలా పవర్ఫుల్ లుక్ లో కనిపించాడు. రామ్ చరణ్ అమ్మోరు తల్లి ఆవహించిందంటూ చెప్పే డైలాగ్ కి టీజర్ కే హైలెట్ గా నిలుస్తోంది.

Share.