అలనాటి అందాల తార భూమిక చావ్లా టాలీవుడ్ లో ఉన్న అగ్ర హీరోలందరితోను నటించింది. ఎన్నో గణ విజయాల్ని తన ఖాతాలో వేసుకుంది. అటు తర్వాత భరత్ ఠాకూర్ అనే వ్యక్తిని వివాహం చేసుకుంది భూమిక. పెళ్ళైన తర్వాత సినిమాల్లో నటించటం తగ్గించింది. ఇక తాజాగా మరో సారి తెలుగులో ” యూ టర్న్ ” సినిమాలో ఒక కీలక పాత్రలో నటిస్తుంది. చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా జరిగిన ఇంటర్వ్యూ లో బాలీవుడ్ హీరోయిన్స్ విద్య బాలన్, మలైకా అరోరా పై ఘాటైన వ్యాఖ్యలు చేసింది భూమిక చావ్లా.
మీడియా విలేకరి అడిగిన ” బాలీవుడ్‌తో పోలిస్తే దక్షిణాది సినిమాల్లో కథానాయికల కోసం సరైన పాత్రలు దర్శకులు, నిర్మాతలు సృష్టించటం లేదా అనే ప్రశ్నకు ” భూమిక సమాధానం ఇస్తూ…గతంలో హీరోయిన్స్ కి అనుకున్న స్థాయిలో ప్రాముఖ్యత ఉండేది కాదని, కానీ ఇప్పుడా పరిస్థితి మారింది..కథానాయికల కోసం ప్రత్యకంగా కొన్ని కథలు రాస్తున్నారు పలువురు దర్శకులు, బాలీవుడ్ నటి విద్యాబాలన్ కి 42 ఏళ్లు.. తానేం పర్ఫెక్ట్ ఫిగర్ కాదు…పైగా వివాహం కూడా జరిగింది. అయినా ఎన్నో మంచి సినిమా అవకాశాలు అందుకుంటుంది, అవార్డ్స్ కూడా అందుకుంది..అలాగే మలైకా అరోరా కి సుమారు 44 సంవత్సరాలు కానీ ఇప్పటికి చాల హాట్ గా ఉంటుంది..40 ఏళ్లు దాటినా కథానాయికల కోసం కూడా ప్రత్యకించి కొన్ని కథలు రాయాలి అప్పుడే ఇండస్ట్రీ లో మార్పు కనిపిస్తుంది అని భూమిక సమాధానం చెప్పారు.