భీమ్లా నాయక్ వెనకడుగు వేయనున్నాడా.. కారణం..!

Google+ Pinterest LinkedIn Tumblr +

పవన్ కళ్యాణ్ హీరోగా, దగ్గుబాటి రానా కలిసి నటిస్తున్న మల్టీ స్టారర్ చిత్రం.. భీమ్లా నాయక్. ఈ సినిమాని దర్శకుడు సాగర్ కే చంద్ర తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం ఫైనల్ షెడ్యూల్లో షూటింగ్ చేసుకుంటోంది ఈ సినిమా. ఇక ఈ మూవీ విడుదల పట్ల నెలకొన్న సస్పెన్స్ మాత్రం అంతా ఇంతా కాదు.

ఈ సినిమా జనవరిలో సంక్రాంతి పండుగకు విడుదల అవుతుందని వార్త విని పించింది. కానీ ఇప్పుడు ఆ రేసు నుంచి తప్పుకున్న ట్లుగా టాక్ బాగా వినిపిస్తోంది. కానీ దీనిపై నిర్మాత నాగవంశీ మాత్రం సంక్రాంతి బరిలోనే దిగబోతోంది అనే వార్తలు కూడా చేయడం జరిగింది. అయితే భీమానాయక్ రిలీజ్ వాయిదా పట్ల పలు చర్చలు జరుగుతున్నాయని సమాచారం కూడా వేలువబడుతోంది.

ఇక ఇందులో సినిమా వాయిదా వేయడానికి ఛాన్సులు ఎక్కువగానే ఉన్నాయి అన్నట్లుగా సినీ ఇండస్ట్రీలో వినిపిస్తోంది. అయితే ఈ విషయంపై మరింత క్లారిటీ రావాలంటే కొద్ది రోజులు ఆగితే తెలుస్తుంది. ఇక ఈ సినిమాకి త్రివిక్రమ్ మాటలు హైలెట్గా నిలవనున్నా ట్లు సమాచారం.

Share.