యువరత్న నందమూరి బాలకృష్ణ హీరోగా కె.ఎస్ రవికుమార్ డైరక్షన్ లో వస్తున్న సినిమా రూలర్. ఈ శుక్రవారం రిలీజ్ అవుతున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో బజ్ అయితే లేదు. ఈ సినిమా నుంచి ఇప్పటికే రెండు ట్రైలర్లు వచ్చాయి. అయినా ఏ మాత్రం అంచనాలు లేవు. బాలయ్య పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా నటించాడు. సోనాల్ చౌహాన్, వేదిక హీరోయిన్లుగా నటించారు.
ఇక సంక్రాంతికి రావాల్సిన బాలయ్య ఇరవై రోజుల ముందే క్రిస్మస్‌కు వచ్చేస్తున్నాడు. ఈ సినిమాపై వస్తున్న రూమర్స్ ఫ్యాన్స్ కు షాక్ ఇస్తున్నాయి. రూలర్ బిజినెస్ కూడా అనుకున్నంత రేంజ్ లో జరగలేదని తెలుస్తుంది. దాదాపు రు.10 కోట్ల టేబుల్ లాస్, అడ్వాన్స్‌లు లేకుండానే రూలర్ రిలీజ్ చేస్తున్నట్టు టాక్..?
ఇక ఈ సినిమాకు థియేటర్లు కూడా సరిగా దొరకడం లేదంటున్నారు. ఇటీవల రిలీజ్ అయిన వెంకీ మామ కంటే చాలా తక్కువ థియేటర్లలోనే ఈ సినిమా రిలీజ్ అవుతోందంటున్నారు. అదే రోజు రూలర్‌తో పాటు సాయిధరమ్ తేజ్ ప్రతిరోజు పండగే, సల్మాన్ ఖాన్ దబాంగ్ 3 ఉన్నాయి. ఈ రెండు సినిమాలకు మల్టీఫ్లెక్స్‌లు, ఏ సెంటర్లలో ఎక్కువ స్క్రీన్లు ఇస్తున్నారు.
రూలర్‌కు చాలా చాలా తక్కువ థియేటర్లే ఉన్నాయి. మరోవైపు వెంకీ మామ స్ట్రాంగ్‌గానే ఉంది. థియేటర్లే దొరకని రూలర్‌కు కనీసం ఆడియెన్స్ అయినా దొరుకుతారా ? అన్న సెటైర్లు పడుతున్నాయి. ప్రతి రోజు పండగే సినిమా రెండు తెలుగు రెండు రాష్ట్రాల్లో 800 థియేటర్లలో రిలీజ్ అవుతుంది.