దుమ్మురేపిన బాల‌య్య `రూల‌ర్‌` ఫ‌స్ట్ డే క‌లెక్ష‌న్స్‌..

Google+ Pinterest LinkedIn Tumblr +

నంద‌మూరి బాల‌కృష్ణ, కె.ఎస్‌.ర‌వికుమార్‌, సి.క‌ల్యాణ్ కాంబినేష‌న్‌లో విజ‌యం సాధించిన చిత్రం `జైసింహా`. ఇదే కాంబినేష‌న్‌లో రూపొందిన మ‌రో చిత్ర‌మే`రూల‌ర్‌`. ఈ చిత్రంలో హీరో బాలకృష్ణ రెండు విభిన్నమైన పాత్రల్లో కనిపించనున్నారు. అందులో ఒక‌టి ఐటీ రంగానికి చెందిన వ్య‌క్తి.. మ‌రో షేడ్‌లో ప‌వ‌ర్‌ఫుల్ పోలీస్ ఆఫీస‌ర్. ఈ చిత్రంలో బాలయ్య సరసన వేదిక, సోనాల్ చౌహాన్ నటిస్తున్నారు. ఎన్టీఆర్‌ బయోపిక్‌గా తెరకెక్కిన కథానాయకుడు, మహానాయకుడు సినిమాలు దారుణంగా ఫెయిల్‌ కావటంతో బాలయ్య అభిమానులు ఈ సినిమా మీదే ఆశలు పెట్టుకున్నారు. భారీ అంచ‌నాల న‌డుమ డిసెంబ‌ర్ 20న ఈ చిత్రం విడుద‌ల అయింది.

‘రూలర్’ సినిమాలో నందమూరి బాలకృష్ణ మరోసారి తనదైన ఎనర్జీతో అభిమానుల‌ను ఆక‌ట్టుకున్నాడు. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అర్జున్ ప్రసాద్‌గా తనదైన ముద్ర వేసాడు. మరోవైపు ధర్మ అనే పోలీస్ అధికారి పాత్రలో రఫ్పాడించాడు. మ‌రియు సినిమాలో రైతు గొప్పతనాన్ని చెప్పే డైలాగుల‌తోప్రేక్షకులను అలరించాడు. కానీ.. నందమూరి అభిమానులు భారీ ఆశలు పెట్టుకున్న ఈ సినిమాకు టాక్‌ ఆశించిన స్థాయిలో లేదని చెప్పాలి.

సినిమాలో కొత్త ద‌నం లేక‌పోవ‌డ‌మే దీనికి కార‌ణం. సినిమా రొటీన్‌ బాలకృష్ణ సినిమాలా ఏ మాత్రం కొత్తదనం లేకుండా సాగుతుంది. యాక్షన్‌, పంచ్‌ డైలాగ్‌లు, హీరోయిన్లతో రొమాన్స్‌ లాంటి అంశాలు అన్నీ గతంలో బాలయ్య సినిమాల్లో చాలా సార్లు చూసినట్టుగానే ఉంటాయి. దీంతో బాల‌య్య ఫ్యాన్స్ చాలా వ‌ర‌కు నిరాశ చెందారు. అయితే బాల‌య్య ఎన‌ర్టీ మాత్రం పీక్స్‌లో ఉంద‌నే చెప్పాలి. ఇక మొద‌టి రోజు క‌లెక్ష‌న్స్ చూస్తే.. మొత్తం తెలుగు రాష్ట్రాల షేర్ 4.11కోట్లు వ‌సూలు చేసింది.

రూల‌ర్ ఏరియా వైజ్ వ‌సూళ్లు :

నిజాం – 0.68 కోట్లు

సీడెడ్ – 1.08 కోట్లు

నెల్లూరు – 0.22 కోట్లు

కృష్ణ – 0.19 కోట్లు

గుంటూరు – 1.20 కోట్లు

వైజాగ్ – 0.27 కోట్లు

ఈస్ట్ – 0.26 కోట్లు

వెస్ట్ – 0.21 కోట్లు
—————————————–
ఏపీ + తెలంగాణ షేర్ = 4.11 కోట్లు
—————————————–

Share.