జూనియర్ ఎన్టీఆర్ దెబ్బ బాలయ్య సినిమాకు తగులుతోందా…?

Google+ Pinterest LinkedIn Tumblr +

గత కొంత కాలంగా నందమూరి అభిమానుల్లో ఒక అపోహ ఉంది అనేది వాస్తవం… రాజకీయ విభేదాలను సినిమాకు కలిపి… నందమూరి హీరోల మధ్య విభేదాలు ఉన్నాయి అనే ప్రచారం ఎక్కువగా చేసారు. బాలకృష్ణ సినిమాలు జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు చూడకపోవడం, జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు బాలకృష్ణ సినిమాలు చూడకపోవడం వంటివి ఎక్కువగా చేస్తున్నారు. టెంపర్ సినిమా సమయంలో ఈ రచ్చ ఎక్కువగా జరిగింది. దీనిపై అప్పుడు నందమూరి అభిమానులే అసహనం వ్యక్తం చేసారు.

వీరు ఇద్దరు పెద్దగా కలిసిన సందర్భం అనేది ఈ మధ్య ఎక్కడా కనపడటం లేదు. రాజకీయ కారణాలు, కుటుంబ కారణాలు దీనికి సాకుగా కొందరు చూపించే ప్రయత్నం చేస్తున్నారు. అది అలా ఉంచితే… ఇప్పుడు బాలకృష్ణ నటించిన రూలర్ సినిమా విడుదల అవుతుంది. ఈ సినిమా మరో రెండు రోజుల్లో విడుదలకు సిద్దంగా ఉంది. కెఎస్ రవికుమార్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా… ఇప్పుడు బాలయ్య అభిమానుల్లో జోష్ నింపుతుంది. బాలయ్య మూడు పాత్రల్లో నటిస్తారు అనే వార్తలు వస్తున్నాయి.

ఈ నేపధ్యంలో ఈ సినిమాను జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు లైట్ తీసుకునే అవకాశం ఉందనే వ్యాఖ్యలు ఇప్పుడు ఎక్కువగా వినపడుతున్నాయి. తారక్ సినిమాను బాలయ్య అభిమానులు చూడటం లేదని అందుకే మేము కూడా చూసేది లేదని… కొంత మంది అభిమానులు పోస్ట్ లు పెడుతున్నారు. ఇక ఈ సినిమాపై కొంత తప్పుడు ప్రచారం కూడా కొందరు చేస్తున్నారు. ఈ ప్రభావం సినిమా వసూళ్ళపై పడే అవకాశం ఉందనే వ్యాఖ్యలు ఇప్పుడు ఎక్కువగా వినపడుతున్నాయి.

Share.