నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం ఎన్‌టిఆర్ బయోపిక్ కోసం చాలా సమయాన్ని కేటాయిస్తున్నాడు. జైసింహా చిత్రం తరువాత కాస్త గ్యాప్ తీసుకున్న ఈ హీరో ఇప్పుడు తన ఫోకస్ మొత్తం ఎన్‌టీఆర్ పైనే పెట్టాడు. కాగా తన నెక్ట్స్ ప్రాజెక్ట్స్‌ను సైతం లైన్‌లో పెట్టేందుకు బాలయ్య రెడీ అవుతున్నాడు. ఈ క్రమంలో బాలయ్య తన నెక్ట్స్ మూవీని మాస్ చిత్రాల స్పెషలిస్ట్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో చేయనున్నాడు.
ఇప్పటికే ఈ కాంబో నుండి రెండు బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ చిత్రాలు వచ్చిన సంగతి అందరికీ తెలిసిందే. సింహా, లెజెండ్ సినిమాలతో బాలయ్య ఎలాంటి పృభంజనం సృష్టించాడో ప్రతిఒక్కరికి తెలిసిందే. అయితే ఈసారి ఆ రెండు సినిమాలను మించిన సినిమా తీసేందుకు బోయపాటి రెడీ అవుతున్నాడట. కాగా గత రెండు చిత్రాల యాక్షన్ ఎంటర్‌టైనర్‌లుగా తెరకెక్కించిన బోయపాటి ఈసారి పక్కా పొలిటికల్ థ్రిల్లర్‌ను రెడీ చేయబోతున్నాడట. బాలయ్య ఇమేజ్‌కు పర్ఫెక్ట్‌గా సరిపోయే పొలిటికల్ థ్రిల్లర్‌ను రెడీ చేయనున్నాడట బోయపాటి.
ప్రస్తుతం వీరిద్దరు తమ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. ఈ ఏడాది చివరికల్లా వీరిద్దరు తమ ప్రాజెక్టులు పూర్తి చేసుకుంటారు. దీంతో ఈ కాంబోలో రాబోయే మూడో సినిమాను 2019 ఎన్నికలకు ముందు రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. మరి బాలయ్య కోసం బోయపాటి ఎలాంటి పొలిటికల్ గేమ్‌ను రెడీ చేస్తాడో చూడాలి.