బాలయ్యను ఇంప్రెస్ చేసిన జగన్

Google+ Pinterest LinkedIn Tumblr +

ఒకప్పుడు పూరితో సినిమా కోసం క్యూలు కట్టే స్టార్ హీరోలు.. ఇప్పుడు పూరి జగన్నాథ్ తో సినిమా అంటే చాలు వామ్మో అనే పరిస్థితి వచ్చింది. అది పూరి తనంతట తాను చేసుకున్నదే లేండి. టెంపర్ తర్వాత సినిమాలైతే చేస్తున్నాడు కాని ఒక్కటి కూడా పూరి మార్క్ అందుకోలేదు. ఫైనల్ గా ఎనర్జిటిక్ స్టార్ రాం తో ఇస్మార్ట్ శంకర్ సినిమా చేశాడు పూరి. ఈ సినిమా రిజల్ట్ మీద చాలామంది భవిష్యత్తు ఆధారపడి ఉంది. పూరితో సినిమా చేస్తే ఆ కిక్కే వేరబ్బా అన్నాడు రామ్.

అయితే హిట్టు పడితే బాగుంటుంది కాని ఫ్లాప్ అయితే ఆ కిక్ ఇంకోలా ఉంటుంది. ఇదిలాఉంటే రామ్ ఇస్మార్ట్ శంకర్ పూర్తిగా మాస్ మసాలా మూవీగా అనిపిస్తుంది. సినిమా రిజల్ట్ ను డిసైడ్ చేసే బి, సి సెంటర్స్ వాళ్లను టార్గెట్ చేస్తూ పూరి ఇస్మార్ట్ శంకర్ తీశాడనిపిస్తుంది. అయితే ఈ సినిమా హిట్టు పడితే నందమూరి బాలకృష్ణ మూవీ ఛాన్స్ ఉందట పూరికి. రీసెంట్ గా బాలయ్య కోసం ఓ కథ రెడీ చేశాడట పూరి. బాలయ్యను కలిసి వినిపించాడట కూడా.

ఇస్మార్ట్ హిట్ పడితే ఆ సినిమా పక్కా సెట్స్ మీదకు వెళ్తుందని సమాచారం. మరి ఇస్మార్ట్ శంకర్ తో పూరి బౌన్స్ బ్యాక్ అవుతాడా లేక తన ఫెయిల్యూర్ కొనసాగిస్తాడా తెలుసుకోవాలంటే మరో వారం రోజులు వెయిట్ చేయాల్సిందే. రాం సరసన నిధి అగర్వాల్, నభా నటేష్ హీరోయిన్స్ గా నటించిన ఇస్మార్ట్ శంకర్ సినిమాకు మణిశర్మ మ్యూజిక్ అందించాడు.

Share.