ఎన్టీఆర్, త్రివిక్రమ్ ఆ పని చేయబోతున్నారా..?

Google+ Pinterest LinkedIn Tumblr +

టాలీవుడ్ లో ఇప్పటి వరకు త్రివిక్రమ్ శ్రీనివాస్ మెగా హీరోలు, మహేష్ బాబు తో ఎక్కువ సినిమాలు తీశారు. ఆ సినిమాలన్నీ సూపర్ హిట్ గా నిలిచాయి. అ..ఆ తో నితిన్ కి కూడా మంచి హిట్ అందించారు త్రివిక్రమ్. మొదటి సారిగా నందమూరి హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో ‘అరవింద సమేత’సినిమా తీస్తున్నాడు త్రివిక్రమ్. ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్స్, టీజర్, సాంగ్స్ కి సోషల్ మీడియాలో విపరీతమైన రెస్పాన్స్ వస్తుంది. ఓ వైపు ఈ సినిమాకు సంబంధించిన లీకేజ్ గోలలు కూడా బాగానే ఉన్నాయి. అరవింద సమేత వీరరాఘవ విడుదల డేట్ దగ్గరపడుతోంది.

అక్టోబర్ 2న ప్రీరిలీజ్ ఫంక్షన్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. హెచ్ఐసిసిలో జరిగే ఈ ఫంక్షన్ చాలా భారీగా చేయాలని ప్లానింగ్ చేస్తున్నారు. ఇక మెగా హీరోలు, మహేష్ బాబు ప్రీ రిలీజ్ ఫంక్షన్ అంటే పెద్ద ఎత్తున ఉంటాయన్న విషయం తెలిసిందే..తాజాగా ఇప్పుడు అరవింద సమేత ఫంక్షన్ ఆ లెవెల్ లో చేయాలని యూనిట్ ప్లాన్ చేస్తోంది. ఈ ఫంక్షన్ లో సంథింగ్ స్పెషల్ గా ఏం ఉంటే బాగుంటుంది అన్నదానిపై డిస్కషన్లు జరుగుతున్నాయట.

సాధారణంగా ఏ ఫంక్షన్ అయినా..అందరికీ ఇష్టమైన యాంకర్ ని తీసుకు వచ్చి ఆ కార్యక్రమాన్ని నడిపిస్తారు. తెలుగు లో ఎక్కువగా ఇలాంటి కార్యక్రమాలకు సుమ, ఝాన్సీ లు ఎక్కువగా కనిపిస్తుంటారు. కానీ ఈసారి మాత్రం అరవింద సమేతకు వెరైటీగా దర్శకుడు త్రివిక్రమ్ హీరో ఎన్టీఆర్ కీలకపాత్ర పోషించేలా యాంకర్ పాత్ర తక్కువ ఉండేలా ప్లాన్ చేస్తే ఎలా ఉంటుందని డిస్కషన్లు జరుగుతున్నట్టు ఫిలిమ్ వర్గాల గుస గుస.

ఇక మైక్ ఇస్తే..త్రివిక్రమ్ పంచ్ లతో ఇరగదీస్తాడు..ఇక ఎన్టీఆర్ తెలుగు అనర్ఘలంగా మాట్లాడుతూ..హాస్యాన్ని కూడా బాగా పండిస్తాడు. గతంలో బిగ్ బాస్ నిర్వాహకుడిగా ఆయన ఓ రేంజ్ లో విజృంభించిన సంగతి అందరికీ తెలిసిందే. ఒకవేళ త్రివిక్రమ్ ఎన్టీఆర్ కనుక యాంకర్లుగా మారితే అరవింద ఫంక్షన్ సినీ చరిత్రలో సంథింగ్ స్పెషల్ అవుతుందని అంటున్నారు అభిమానులు.

Share.