సీడెడ్‌ సీన్ సితార్ చేసిన అరవింద సమేత

Google+ Pinterest LinkedIn Tumblr +

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తు్న్న లేటెస్ట్ సెన్సేషన్ అరవింద సమేత రిలీజ్‌కు ముందే దుమ్ములేపుతోంది. ఇంకా షూటింగ్‌లోనే ఉన్న ఈ సినిమా పలు కొత్త రికార్డులకు కేరాఫ్‌గా మారుతోంది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్ట్ చేస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. దీనికి తోడు ఇటీవల రిలీజ్ అయిన చిత్ర టీజర్‌కు అదిరిపోయే రెస్పాన్స్ రావడంతో ఈ సినిమా ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందా అని ఆతృతగాఎదురుచూస్తున్నారు జనాలు.

అయితే తాజాగా ఈ చిత్ర సీడెడ్ రైట్స్‌ అదిరిపోయే రేటుకు అమ్ముడయినట్లు తెలుస్తోంది. సీడెడ్ థియేట్రికల్ రైట్స్‌కు గాను ఈ సినిమాను రూ.15 కోట్ల భారీ రేటుకు సొంతం చేసుకున్నారు అక్కడి బయ్యర్లు. ఆ ప్రాంతంలో ఇంతటి భారీ రేటుకు రైట్స్ అమ్ముడవ్వడంతో అరవింద సమేత చిత్రం టాప్ 4వ స్థానంలో నిలిచింది. ఇంతకు ముందు బాహుబలి 2 – 25 కోట్లు, అజ్ఞాతవాసి – 16.20 కోట్లు, రామ్ చరణ్ 12 – 15.40 కోట్లకు అమ్ముడుపోయి టాప్ 3 స్థానాల్లో నిలిచాయి. ఇప్పుడు అరవింద సమేత 4వ స్థానంలో నిలవడంతో ఈ సినిమా ఎలాంటి కలెక్షన్లు రాబడుతుందా అని లెక్కలు వేస్తున్నారు జనాలు.

కాగా సీడెడ్ ప్రాంతంలో ఇప్పటివరకు కేవలం బాహుబలి 1, ఖైదీ నెంబర్ 150, బాహుబలి 2, రంగస్థలం చిత్రాలు మాత్రమే రూ.15 కోట్లకు పైగా వసూళ్లు సాధించాయి. మరి రాయలసీమ బ్యా్క్‌డ్రాప్‌లో వస్తున్న అరవింద సమేత ఎంత కలెక్ట్ చేస్తుందో చూడాలి.

Share.