అనుష్క అమెరికా దెయ్యంగా మారుతుందా..!

Google+ Pinterest LinkedIn Tumblr +

భాగమతి తర్వాత అనుష్క చేస్తున్న సినిమాలపై అఫిషియల్ ఎనౌన్స్ మెంట్ ఏది రాలేదు. అసలైతే సినిమాలను ఆపేసి పెళ్లి చేసుకుంటుందని అంటున్నా అనుష్క సన్నిహితులు మాత్రం అలాంటిదేమి లేదు 2019లో ఓ సినిమాతో సర్ ప్రైజ్ చేస్తుందట. అంతేకాదు మరోసారి ప్రభాస్ సరసన కూడా జోడీ కడుతుందని అంటున్నారు. ఇదిలాఉంటే కోనా వెంకట్ నిర్మాణం సార్ధ్యంలో హేమంత్ డైరక్షన్ లో అనుష్క ఓ సినిమా చేస్తుందట. సీక్రెట్ గా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాలో అనుష్క దెయ్యంగా నటిస్తుందని అంటున్నారు.

అంటే అమెరికాలో అరుంధతిగా ఈ సినిమా ఉండబోతుందన్నమాట. ఈ సినిమాకు టైటిల్ కూడా సీక్రెట్ అని పెట్టబోతున్నారట. అనుష్కకు జంటగా మాధవన్ ఈ సినిమాలో నటిస్తున్నాడని తెలుస్తుంది. అనుష్క ఫ్యాన్స్ అంచనాలకు తగినట్టుగా ఈ సినిమా వస్తుందట. మాధవన్ ఇప్పటికే తెలుగులో సవ్యసాచి విలన్ గా చేశాడు. రవితేజ, వీఇ ఆనంద్ సినిమాలో విలన్ గా కూడా మాధవన్ చేస్తున్నాడట. అనుష్కతో మాధవన్ 13 ఏళ్ల క్రితం రెండు సినిమా చేశాడు.

మళ్లీ ఈ ఇద్దరు కలిసి ఈ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ చేస్తున్నారట. అమెరికాలో దెయ్యం సినిమా అంటే కచ్చితంగా హాలీవుడ్ మార్క్ ట్రీట్ మెంట్ ఉంటుంది. మరి సినిమాను సీరియస్ గా నడిపిస్తారో లేక మన తెలుగు హర్రర్ సినిమాల్లా కామెడీ మిక్స్ చేస్తారో చూడాలి. అనుష్క చేస్తున్న ఈ సినిమా సక్సెస్ అయితే మళ్లీ ఆమె ట్రాక్ లోకి వచ్చినట్టే. సైజ్ జీరో కోసం లావెక్కిన అనుష్క ఈ సినిమాలో మళ్లీ మునుపటి అందంతో సన్నగా కనిపిస్తుందట. అందుకే ఈమధ్య ఎవరికి కనిపించకుండా ఉంటుంది.

Share.