బన్నీ చేతిలో దారుణంగా మోసపోయిన దర్శకుడు..!

Google+ Pinterest LinkedIn Tumblr +

నా పేరు సూర్య తర్వాత తన లేటెస్ట్ సినిమా ప్రకటించడంలో జాప్యం చేస్తున్న స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నెక్ష్ట్ మూవీ విక్రం కే కుమార్ డైరక్షన్ లో చేస్తున్నాడని అన్నారు. కెరియర్ లో మనం తప్ప ఇంతవరకు ఎలాంటి కమర్షియల్ సక్సెస్ అందుకోలేని విక్రం కుమార్ మీద నమ్మకం కుదరట్లేదట బన్నికి.

లైన్ చెప్పి ఓకే చేయించుకున్నా స్క్రిప్ట్ మొత్తం పూర్తి చేశాక విక్రం కథ మీద అసంతృప్తి మొదలైందట. ఫస్ట్ హాఫ్ వరకు ఓకే కాని సెకండ్ హాఫ్ మాత్రం నచ్చలేదని చెప్పాడట. రెండు మూడు వర్షన్స్ చెప్పినా సరే సారీ అనేయడంతో దాదాపు ప్రాజెక్ట్ అటకెక్కేసిందని అంటున్నారు. ఇన్నాళ్లు సినిమా చేస్తా అని తిప్పుకుని ఇప్పుడు బన్ని విక్రం కు హ్యాండ్ ఇచ్చాడని అంటున్నారు.

అరవింద సమేత తర్వాత ఎలాగు త్రివిక్రం ఖాళీ కాబట్టి బన్ని త్రివిక్రం మీద కన్నేసినట్టు తెలుస్తుంది. ఆల్రెడీ ఈ ఇద్దరి కాంబినేషన్ లో జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి సినిమాలొచ్చి సూపర్ హిట్ అయ్యాయి. మరి బన్ని విక్రం, త్రివిక్రం లలో ఎవరితో తన నెక్ష్ట్ మూవీ చేస్తాడో చూడాలి.

Share.