బన్నీతో స్వీటీ అనిపిస్తున్న త్రివిక్రమ్

Google+ Pinterest LinkedIn Tumblr +

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ఇటీవల అరవింద సమేత‌తో అదిరిపోయే హిట్ అందుకున్నాడు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ చిత్రంగా నిలిచి అజ్ఞాతవాసితో త్రివిక్రమ్ పోగొట్టుకున్న పేరును తిరిగి సంపాదించుకున్నాడు. ఇక ఈ సినిమా తరువాత తన నెక్ట్స్ మూవీ విషయంలో అప్పుడే అడుగులు వేస్తున్నాడు ఈ దర్శకుడు.

గతంలో జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి వంటి రెండు హిట్స్‌తో స్టైలిష్ స్టార్‌ అల్లు అర్జున్‌కు మంచి పేరును సంపాదించిపెట్టిన ఈ దర్శకుడు ఇప్పుడు ముచ్చటగా మూడోసారి మరో సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడు. తాజా సమాచారం ప్రకారం త్రివిక్రమ్ ఒక మీడియం బడ్జెట్‌ సినిమాను తెరకెక్కించాలని చూస్తున్నాడట. తొలుత ఈ సినిమాలో నానిని హీరోగా అనుకున్నాడట త్రివిక్రమ్.. అయితే నాని వరుస సినిమాలతో బిజీగా ఉండటంతో ఇప్పుడు బన్నీతో చేసేందుకు రెడీ అయ్యాడు. కాగా ఇది బాలీవుడ్ సోను కే టిటు స్వీటీ అనే సినిమాకు రీమేక్‌ అని తెలుస్తోంది. బాలీవుడ్‌లో మంచి హిట్‌గా నిలిచిన ఈ కామెడీ ఎంటర్‌టైనర్‌ను త్రివిక్రమ్ మార్క్‌తో కొన్ని మార్పులు చేర్పులు చేసి తెలుగు ప్రేక్షకులకు నవ్వులు పంచాలని చూస్తు్న్నాడట ఈ డైరెక్టర్.

అటు బన్నీ కూడా నా పేరు సూర్య డిజాస్టర్‌తో తన నెక్ట్స్ మూవీని త్రివిక్రమ్‌తో చేసేందుకు రెడీ అవుతున్నాడట. మరి వీరిద్దరి కాంబినేషన్‌లో మూడో సినిమా వస్తే అది ఖచ్చితంగా రీమేక్ సినిమానే అవుతుందా? అనే ప్రశ్న ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

Share.