అఖిల్ మళ్లీ మొదటికి వచ్చాడా..

Google+ Pinterest LinkedIn Tumblr +

అక్కినేని నట వారసుడు అఖిల్ మొదటి రెండు సినిమాలు పెద్దగా క్రేజ్ తీసుకురాలేదు. మొదటి సినిమా అఖిల్ ఫ్లాప్ అవగా హలో మాత్రం ఏదో అలా ఆడింది. అయితే ఈసారి మూడవ సినిమాగా తొలిప్రేమ దర్శకుడు వెంకీ అట్లూరితో జతకట్టాడు అఖిల్. ఈ సినిమా తప్పకుండా అఖిల్ కు హిట్ ఇస్తుందని భావిస్తుండగా మళ్లీ అఖిల్ వేలుపెట్టుడు మొదలుపెట్టాడని టాక్.

కథ చెప్పినప్పుడు ఓకే అని చెప్పిన అఖిల్ సెట్స్ మీద మాత్రం వెంకీకి సలహాలు ఇస్తున్నాడట. వెంకీ అనుకున్న విధంగా కాకుండా అఖిల్ చెప్పిన విధంగా చెయ్యాలని సూచించాడట. అయితే దానికి వెంకీ ఒప్పుకోవట్లేదని టాక్. అయితే దర్శకుడు తీసిన సన్నివేశాలను అఖిల్ పదే పదే వచ్చి కెమెరా లో చూడటం, దర్శకుడు తీసిన విధానం బాలేదని మరో విధంగా ఈ షాట్ తీసుంటే ఇంకా బాగా వస్తుందని, కెమెరా ను ఫలానా యాంగిల్ లో పెట్టి తిస్తె సీన్ ఇంకా బాగా కొత్తగా వస్తుందని అఖిల్ చెప్పారట. ఇలా పలు సీన్స్ ని అఖిల్ కెమెరా లో చూస్తూ దర్శకుడుకి మరియు కెమరామెన్ కి సలహాలు ఇస్తున్నారని టాక్.
అందుకే షూటింగ్ కు అనుకున్న విధంగా అఖిల్ అటెండ్ అవట్లేదట. ఏమన్నా అడిగితే సిల్లీ రీజన్స్ చెప్పి తప్పించుకుంటున్నాడట.

వరుణ్ తేజ్ తొలిప్రేమ విషయంలో అలా జరగలేదు. వెంకీ చెప్పినట్టుగా చేసి హిట్ కొట్టాడు. మరి అఖిల్ మళ్లీ తప్పులో కాలేస్తున్నాడని చెప్పొచ్చు. విషయం తెలిసినవారు అఖిల్ తన పంథా మార్చుకోకుంటే చాలా కష్టమని అంటున్నారు.

Share.