ఆదా శర్మ డ్యాన్స్ వీడియో చూసారా..

Google+ Pinterest LinkedIn Tumblr +

ప్రముఖ నటి ఆదా శర్మ సోషల్ మీడియా లో తన ఫ్యాన్స్ తో ఎప్పుడు టచ్ లోనే ఉంటుంది. తన లేటెస్ట్ పిక్స్ మరియు వీడియోస్ ని అభిమానులతో ఎప్పటికప్పుడు షేర్ చేసుకుంటుంది. ఆదా గతంలో అల్లు అర్జున్ సినిమా ‘సన్ అఫ్ సత్యమూర్తి’ లో ప్రేక్షకులని అలరించింది. అయితే తాజాగా తన అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్ ద్వారా ఆదా శర్మ కికి ఛాలెంజ్ ని స్వీకరిస్తూ ఒక వీడియో పోస్ట్ చేసింది.
ఈ వీడియో లో ఆదా చేసిన డ్యాన్స్ చూసి నెటిజన్స్ ఫిదా అయిపోతున్నారు. కథక్ మరియు భరతనాట్యం చేస్తూ దర్శనమిచ్చింది ఆదా. ఈ వీడియో షేర్ చేసిన కొద్దీ సేపటికే లక్షల్లో వ్యూస్ రావటం విశేషం. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియా లో హాల్ చల్ చేస్తుంది. తన లేటెస్ట్ సినిమా సెట్ నుండి ఆదా ఈ డ్యాన్స్ వీడియో ని షూట్ చేసి తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా అభిమానులతో పంచుకుంది.

Share.