పవన్ స్టార్ హీరో అవుతాడని ఆమె అస్సలు అనుకోలేదట!

Google+ Pinterest LinkedIn Tumblr +

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్రేజ్ ఎలాంటిదో అందరికీ తెలిసిందే. ఆయన స్టార్ స్టేటస్ గురించి ఎవ్వరిని అడిగినా చెబుతారు. అయితే ఇంతటి స్టార్ స్టేటస్ మరియు క్రేజ్ సాధించడంలో పవన్ ఎలా సక్సెస్ అయ్యారో కూడా అందరికీ తెలిసిందే. కానీ ఇలాంటి స్టేటస్ పవన్‌కు వస్తుందని ఒకరు అస్సలు అనుకోలేదట. ఇంతకీ ఆ వ్యక్తి ఎవరో తెలుసా..? పవన్ కళ్యాణ్ మొదటి చిత్రం ‘‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’’ హీరోయిన్ సుప్రియ.

పవన్‌తో కలిసి తొలిసారి ఇండస్ట్రీకి పరిచయం అయిన ఈమె ఆ తరువాత మరెక్కడా కనిపించలేదు. అక్కినేని ఫ్యామిలీ నుండి వచ్చిన సుప్రియ చాలా గ్యాప్ తరువాత ఇప్పుడు ‘‘గూఢచారి’’ సినిమాలో నటించింది. ఈ చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా ఒక మీడియా ఛానల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చిన సుప్రియ పవన్ కళ్యాణ్ ఇంతటి క్రేజ్ మరియు ఫాలోయింగ్‌ ఉన్న హీరోగా ఎదుగుతాడని ఆమె అస్సలు అనుకోలేదని చెప్పింది. తనతో నటించిన మొదటి హీరో ఇంతటి భారీ ఫ్యాన్ ఫాలోయింగ్‌ సొంతం చేసుకోవడం ఆమెకు నిజంగా సంతోషంగా ఉందని చెప్పింది.

ఇలా పవన్ కళ్యాణ్ మొదటి హీరోయిన్ ఆయనపై ఇలాంటి కామెంట్ చేయడంతో పవన్ ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీగా ఉన్నారు. మొత్తానికి పవన్ చరిష్మాకు సుప్రియ కూడా ఇంప్రెస్ అయ్యిందని ఫ్యాన్స్ చెబుతున్నారు. కాగా అడివి శేష్ నటించిన గూఢచారి బాక్సాఫీస్ వద్ద అదిరిపోయే టాక్‌ను సొంతం చేసుకుని బ్లాక్‌బస్టర్ దిశగా దూసుకుపోతుంది.

Share.