ప్రముఖ నటుడు ఇర్ఫాన్ ఖాన్ ఈరోజు ఉదయం ఒక సంచలన ప్రకటన చేసారు. ఇర్ఫాన్ ఖాన్ గత కొద్దీ నెలలుగా న్యూరో ఎండ్రోక్రిన్ ట్యూమర్ అనే ఒక మెదడు సంబంధిత వ్యాధితో బాధపడుతున్న విషయం తెలిసిందే. చికిత్స కోసం అయన లండన్ లోని ప్రముఖ క్యాన్సర్ ఆసుపత్రి కి వెళ్లారు. ఇక ఇవాళ తన అభిమానులహో సోషల్ మీడియా ద్వారా నేను ఇక ఎంతో కాలం బతకానని, మహా అంటే మరో రెండు నెలలు లేదంటే మరో రెండు సంవత్సరాలు బతుకుతాను ఈ విషయం నా మనసు మరియు నా మెదడు ఎప్పటికప్పుడు నాకు చెబుతూనే ఉన్నాయ్.
ఇక ఈ విషయం పై నేను ఏమి స్పందించనని నా చేతుల్లో మిగిలి ఉన్న ఈ అతికొద్ది సమయాన్ని వీలైనంత సంతోషంగా సరదాగా గడపటానికి ప్రయత్నిస్తానని వెల్లడించారు. ప్రస్తుతం నాలుగు కీమో థెరపీ సైకిల్స్ కి సంబంధించిన ట్రీట్ మెంట్ పూర్తయిందని, త్వరలో నాకు మరో స్కాన్ తీస్తారని ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత మిగిలిన విషయాలు వెల్లడిస్తానని చెప్పారు ఇర్ఫాన్ ఖాన్.
ఎక్కువ కాలం బతకను, యాక్టర్ సంచలన ప్రకటన
Share.